Begin typing your search above and press return to search.
ఇవాంకా కోసం హైదరాబాద్ రోడ్లకు అంత ఖర్చు
By: Tupaki Desk | 7 Nov 2017 9:59 AM GMTఇంట్లో నుంచి బయటకు వస్తే చాలు రోడ్ల నరకమే. హైదరాబాద్ మహానగరంలో నివసించే ప్రతి ఒక్కరికి ఈ అనుభవమే ఎదురవుతుంది. అయితే.. ప్రపంచానికి పెద్దన్న.. అమెరికా అధ్యక్షుని కుమార్తె ఇవాంకా నగరానికి రానున్న వేళ.. ఆమె పర్యటించే ప్రాంతాల్లోని రోడ్లు మొత్తం తళతళలాడనున్నాయి.
ఈ నెల 28 నుంచి 30 వరకు వరల్డ్ బిజినెస్ సదస్సు కోసం ట్రంప్ కుమార్తె ఇవాంకా హైదరాబాద్ కు రానున్నారు. ఈ సంద్భంగా ఆమె కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట్లో ఆమె ఫలక్‌నుమాలో బస చేస్తారన్న ప్రచారం జరిగినా.. తాజాగా మాత్రం రహేజా ఐటీ పార్కు ప్రాంగణంలోని హోటల్ వెస్టిన్ లో బస చేయనున్నట్లు చెబుతున్నారు.
భద్రతా కారణాల దృష్ట్యా ఫలక్ నామా ప్యాలెస్ కంటే వెస్టిన్ సురక్షితమైనదని.. సభా ప్రాంగణానికి దగ్గరగా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఇవాంకా పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసినట్లుగా తెలుస్తోంది.
హోటల్ వెస్టిన్ నుంచి సదస్సు జరిగే ప్రాంగణంలోని రోడ్లను మరింత మెరుగ్గా చేసేందుకు జీహెచ్ ఎంసీ యుద్ధ ప్రాతిపదికన పనులు నిర్వహిస్తోంది. సదస్సు ప్రారంభానికి ఒక రోజు ముందు రానున్న ఇవాంకా. నాటి నుంచి హైదరాబాద్ లో ఉన్నంత వరకూ వెస్టిన్ లోనే బస చేయనున్నారు. అయితే.. విందుకోసం ఒకసారి మాత్రం ఫలక్ నామా ప్యాలెస్ కు వెళ్లనున్నట్లు చెబుతున్నారు. ఇక.. ఆమె పర్యటించే ప్రాంతాల్లో రోడ్లు బాగుండేలా ఉండాలన్న ఉద్దేశంతో దాదాపు రూ.46 కోట్లను ఖర్చు చేస్తుండటం గమనార్హం.
కోటికి పైగా ప్రజలు రోడ్లు సరిగా లేక నానా అవస్థలు పడుతుంటే పట్టించుకోని ప్రభుత్వం.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీలుగా మాత్రం రూ.46 కోట్లు (కరెక్ట్ గా చెప్పాలంటే రూ.45.70కోట్లు) ఖర్చు చేస్తుండటం గమనార్హం.