Begin typing your search above and press return to search.
ఇవాంకా ఆధార్.. ఇప్పుడు మస్తు కామెడీ!
By: Tupaki Desk | 2 Dec 2017 10:59 AM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ఇండియాకు.. అందునా హైదరాబాద్కు వచ్చి వెళ్లిపోయింది. ఇవాంక రావటానికి ముందు.. వచ్చిన తర్వాత మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ ఎంత హడావుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎవరికి వారు వారికి తోచినట్లుగా సటైర్లు వేసుకున్నారు.
ఇవాంక కోసం భారీ ఏర్పాట్లు చేసిన తెలంగాణ రాష్ట్ర సర్కారు భారీగా బద్నాం అయ్యింది. మరి ముఖ్యంగా రోడ్లను అద్దాలుగా మార్చిన వైనం హైదరాబాదీల కడుపు మండిపోయేలా చేసింది. పన్ను కట్టిన తమను పట్టించుకోని పాలకులు.. ఇవాంక వస్తుందంటే మాత్రం భారీగా రోడ్లను మరమ్మతులు చేయటమేకాదు.. ఏకంగా రూ.100 కోట్లకు పైనే ఖర్చు చేసిన వైనం మంట పుట్టేలా చేసింది.
సందట్లో సడేమియా అన్నట్లుగా మీడియా సైతం.. ఇవాంక కోసం మెరుగులు దిద్దిన రోడ్లను ఫుల్ ఫోకస్ చేయటంతో కొందరు సెలబ్రిటీలు సైతం స్పందించారు. దీంతో.. సోషల్ మీడియాలో కేసీఆర్ సర్కారు మీద పంచ్ లకు కొదవలేదు. ఇదిలా ఉంటే.. ఇవాంక వెళ్లిపోయిన తర్వాత కూడా ఆమెకు సంబంధించిన ముచ్చట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు తెర మీదకు వచ్చింది. ఇవాంక హైదరాబాద్ టూర్ మీద కమెడియన్ జోస్ కొవాకో ఒక ట్వీట్ చేశారు. ఇవాంక భారత్ కు ఆధార్ కార్డు కోసం వచ్చిందని పేర్కొంటూ ఒక ట్వీట్ చేయటమే కాదు.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఆమె బయటకు వచ్చి అక్కడి వారిని పలుకరించిన వీడియో ఫుటేజ్ ను తనకు తోచినట్లుగా మార్చారు. పనిలో పనిగా వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఆధార్ కోసం ఆమె వచ్చినట్లుగా కామెడీ చేశారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ కామెడీ వీడియోను పట్టించుకోనట్లుగా వ్యవహరించాల్సిన ఆధార్ అధికారులు.. సీరియస్ గా తీసుకున్నారు. ఇవాంక ఆధార్ కోసం రాలేదని.. ఆమె భారతదేశ పౌరురాలు కాదంటూ వ్యాఖ్యానిచటం ఇప్పుడు మరింత కామెడీగా మారింది. జోకును జోక్ గా తీసుకోకుండా మరీ అంత సీరియస్ గా తీసుకోవటం ఏమిటని పలువురు నవ్వుకుంటున్నారు.