Begin typing your search above and press return to search.
కరోనా వైరస్ ను రెండు రోజుల్లో పూర్తిగా చంపేసిందట!
By: Tupaki Desk | 5 April 2020 5:05 AM GMTవంద కోట్ల మందిలో కలవరాన్ని క్రియేట్ చేసి.. దేశాలకుదేశాలు ఆగమాగమయ్యేలా చేయటంలో కరోనాకు మించింది మరొకటి లేదు. ఇటీవల కాలంలో ఇంత డేంజర్ వైరస్ బయటకు వచ్చింది లేదు. మందు లేని ఈ మహమ్మారి అంతు చూసేందుకు పలు దేశాలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా ఈ ప్రయోగాల్లో ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు ఒక అడుగు ముందుకు వేసినట్లుగా చెబుతున్నారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ ను ల్యాబ్ లో తయారు చేసిన ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు.. తాము తయారు చేసిన ఔషధాన్ని దీనిపై ప్రయోగించారు. ఆసక్తికరంగా 24 గంటల వ్యవధిలోనే వైరస్ తీవ్రతను తగ్గించటమే కాదు.. రెండు రోజుల వ్యవధిలో పూర్తిగా చంపేసిన వైనాన్ని గుర్తించారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదో గుడ్ న్యూస్ గా చెబుతన్నారు. ఇవెర్ మెక్టిన్ అనే ఔషదాన్ని ల్యాబ్ లో తయారు చేసిన కోవిడ్ 19 మీద ప్రయోగించారు. హెచ్ ఐవీ.. డెంగీ.. ఇన్ ఫ్లూయెంజా.. జికా వైరస్ లాంటి పలు సూక్ష్మ క్రిములపై ఈ మందు సమర్థవంతంగా పని చేసింది.
ఇదే మందును.. కోవిడ్ 19 మీద ప్రయోగించగా.. పాజిటివ్ రిజల్ట్ వచ్చినట్లుగా చెబుతున్నారు. ఆస్ట్రేలియాలోని మోనాష్ వర్సిటీకి చెందిన కైలీ టీం ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. వీరు రూపొందించిన డోస్ తో కోవిడ్ 19 వైరస్ ను పూర్తిగా నిలువరించినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఇది ప్రయోగశాలలోనే నిర్వహించిన ప్రయోగం. దీన్ని మనుషులపై ప్రయోగిస్తే కానీ పూర్తి ఫలితం ఎలా ఉందన్నది అర్థం కాదు. ఏమైనా..కోవిడ్ 19కు చెక్ పెట్టే విషయంలో ఇదో ముందడుగుగా చెప్పక తప్పదు.