Begin typing your search above and press return to search.
ఆ వ్యాఖ్యలకు ఐవైఆర్ కౌంటర్ అదిరింది!
By: Tupaki Desk | 8 Jun 2018 11:42 AM GMTఏపీ సీఎం చంద్రబాబుపై టీటీడీ ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కొద్ది రోజులుగా సంచలన ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన గురువారం సాయంత్రం ఏపీ ప్రతిపక్ష నేత - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. తనతో పాటు మరో ముగ్గురిని ఉన్నపళంగా నిబంధనలకు విరుద్ధంగా తొలగించారని వివరించారు. తన వాదన వినిపించేందుకు చంద్రబాబు నాయుడు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని రమణ దీక్షితులు ఆరోపించారు. రమణ దీక్షితులుకు న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రమణ దీక్షితులు - జగన్ ల భేటీపై కొందరు విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలపై ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఘాటుగా స్పందించారు. జగన్ పై వస్తోన్న విమర్శలను తిప్పికొడుతూ ట్విట్టర్ లో ఘాటుగా బదులిచ్చారు.
రమణదీక్షితులు గారు జగన్ గారిని బహిరంగంగా కలిశారని, ఇందులో పెద్ద రహస్యమేమీ లేదని ఐవైఆర్ అన్నారు. తనకు జరిగిన అన్యాయం గురించి ఆయన వివరించారని, అందులో తప్పేమీ లేదని అన్నారు. ఆ భేటీపై కొందరు అవాకులుచవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. ఆపరేషన్ గరుడలో భాగంగా ఈ భేటీ జరిగిందని ఒక వ్యక్తి విమర్శిస్తాడని అన్నారు. దీక్షితులుగారు జగన్ కు పాదాకాంత్రమయ్యారని మరో తీవ్రవాది అంటాడని ఎద్దేవా చేశారు. వేరొక ఉగ్రవాది.....దీక్షితులు, జగన్ లకు బంధుత్వాన్ని అంటగడతాడని మండిపడ్డారు. శ్రీ వైష్ణవులకు ఇది కూడని పని అని కొన్ని వైష్ణవ సంఘాలు అంటున్నట్లు వార్తలు ప్రసారమయ్యాయని దుయ్యబట్టారు. కొద్దిరోజుల క్రితం చంద్రబాబుపై ఐవైఆర్ మండిపడ్డ విషయం విదితమే. ‘ఆపరేషన్ గరుడ’కు దర్శక, నిర్మాత, రచయిత చంద్రబాబేనని ఐవైఆర్ ఎద్దేవా చేశారు. తన స్క్రిప్టును నటుడు శివాజీతో చంద్రబాబు చెప్పించారని, ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ‘ఆపరేషన్ గరుడ నిజం కావచ్చు..’ అంటూ నవ నిర్మాణ దీక్షలో దీర్ఘాలు తీశారని ఆరోపించారు.