Begin typing your search above and press return to search.
బాబు చెప్పినట్లే ఐవీఆర్ ను వాడేస్తున్నారు
By: Tupaki Desk | 30 Jan 2016 4:31 AM GMTచంద్రబాబు లాంటి వ్యక్తి నోటి నుంచి ఒక సీనియర్ అధికారికి ప్రశంసలు లభించటమే కాదు.. ఆయన రిటైర్ అయినా.. ఆయన్ను పూర్తిగా వాడేస్తామంటూ చెప్పిన మాటకు తగ్గట్లే చేతల్లో చేసి చూపించింది ఏపీ రాష్ట్ర సర్కారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఐవైఆర్ కృష్ణారావు ఈ నెల 31న (అంటే ఆదివారం) రిటైర్ కానున్నారు. ఐవైఆర్ లాంటి సీనియర్ అధికారి రిటైర్ అయిపోవటం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుతారం ఇష్టం లేదు.
ఇదే విషయాన్ని ఇటీవల నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలోనూ ఆయన ప్రస్తావించారు. దీనికి తగ్గట్లే ఏపీ సర్కారు కృష్ణారావు సేవల్ని వినియోగించుకునేందుకు వీలుగా.. జంట పదవులు కట్టబెట్టింది. ఇటీవల ఏర్పాటు చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్ కు ఛైర్మన్ గా.. దేవాదాయ అర్చకులు.. ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్టుకు ఐవైఆర్ ను ఛైర్మన్ గా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అయ్యాక ఆయన సేవల్ని పూర్తిగా వాడేస్తామన్న మాటకు తగ్గట్లే ఆయనకు రెండు పదవులు అప్పజెప్పటం గమనార్హం. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో భాగంగా ఐవైఆర్ మూడేళ్లు కొనసాగనున్నారు.