Begin typing your search above and press return to search.
చెరువు మీద అలిగిన బాబు..ఐవైఆర్ సెటైర్
By: Tupaki Desk | 16 Jun 2018 11:06 AM GMTచంద్రబాబు వైఖరి వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతోందని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణరాజు ట్విట్టర్ లో పలు సంచలన ఆరోపణలు చేశాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంలో యాంటీ ప్రభుత్వం ఉంటే అభివృద్ధి సాధ్యపడదు అన్న మాటలకు ఐవైఆర్ కౌంటర్ ఇచ్చారు.
‘కేంద్రంలో ఒక పార్టీ.. రాష్ట్రంలో మరో పార్టీ పరిపాలనలో ఉండటం ఇదే తొలిసారి కాదని.. గతంలోనూ ఈ విధంగా ప్రభుత్వాలు నడిచాయని.. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు రాజకీయంగా విభేదించినా ఒక తలుపు తెరిచి ఉంచి.. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలని ’ ఐవైఆర్ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.
కానీ సీఎం చంద్రబాబు నత వ్యక్తిగత స్థాయికి ఈ విభేదాలు తీసుకురావడంతో రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగుతోందని ఐవైఆర్ మండిపడ్డారు. ఈ విషయంలో టీడీపీ అస్మదీయ ప్రసార మాధ్యమాలు అగ్నికి ఆజ్యం పోస్టూ రాష్ట్రానికి నిధులు రాకుండా చేస్తున్నాయని ఐవైఆర్ విమర్శించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశాన్ని రాష్ట్రం బహిష్కరించిందని .. ‘‘చెరువు మీద అలిగితే చెరువుకు నష్టం కాదని.. అపార అనుభవం గల చంద్రబాబుకు ఈ విషయం తెలియదా’’ అని ఐవైఆర్ ఎద్దేవా చేశారు. విపక్షంలో ఉంటూనే కరుణానిధి తమిళనాడు ప్రయోజనాలు కాపాడారని ఈ విషయంలో చంద్రబాబు విఫలమయ్యాడని పరోక్షంగా ఐవైఆర్ విమర్శించారు.