Begin typing your search above and press return to search.

ఐవైఆర్ సూటి ప్ర‌శ్న‌కు బాబు స‌మాధానం ఏంటో!

By:  Tupaki Desk   |   20 Jun 2017 11:33 AM GMT
ఐవైఆర్ సూటి ప్ర‌శ్న‌కు బాబు స‌మాధానం ఏంటో!
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు - తెలుగుదేశం పార్టీ శ్రేణుల‌కు ఏపీ బ్రాహ్మ‌ణ ప‌రిష‌త్ కార్పోష‌న్ మాజీ చైర్మ‌న్ - మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఇర‌కాటంలో ప‌డేసే ప్ర‌శ్న‌లు వేశారు. వైసీపీ సానుభూతిప‌రుల ఫేస్‌బుక్ పోస్టులు షేర్ చేయ‌డ‌మే త‌ప్పు అని విమ‌ర్శ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో అదే అంశంపై ఘాటుగా స్పందించారు. వైసీపీ ఎమ్మెల్యేతో స‌మావేశం విష‌యంలో త‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్న వారు త‌మ విధానాల‌ను ఆలోచించుకోవాల‌న్నారు. స్థానికంగా జ‌రిగిన కార్య‌క్ర‌మం కాబ‌ట్టి వైసీపీ ఎమ్మెల్యే కార్య‌క్ర‌మానికి వెళ్లిన‌ట్లు కృష్ణారావు వివ‌రించారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ నాయ‌కుడు అయిన‌ లగడపాటిని కలిస్తే తప్పు లేదు కానీ, తాను వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతిని కలిస్తే తప్పా అని నిల‌దీశారు. లోకల్ ఎమ్మెల్యే ప్రోగ్రాం కి పిలిస్తే ఎందుకు వెళ్లావు అంటూ త‌న‌ను నిల‌దీశార‌ని ఐవైఆర్ తెల‌పిఆరు.

6 నెలలు నుంచి సీఎం అపాయింట్‌ మెంట్ కోసం ఎదురుచూస్తున్నాన‌ని, అయినా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో త‌నకు తీవ్రంగా బాధ క‌లిగింద‌ని ఐవైఆర్ అన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మ‌న్‌ పదవికి న్యాయం చెయ్యాలి అన్ని ఇగో హర్ట్ ఆయన పర్లేదు అనుకున్నాన‌ని వివ‌రించారు. బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ రుణాలు వైసీపీకి ఇస్తున్నారని అంటున్నారు దీనిని తాను ఖండిస్తున్నాన‌ని తెలిపారు. ల‌బ్ధిదారుల్లో వైసీపీ - టీడీపీ అని ఎలా ఉంటార‌ని ఐవైఆర్ ప్ర‌శ్నించారు. లబ్ధిదారులకు న్యాయం జరగాలి కాని వైసీపీ టీడీపీ అంటూ పార్టీల పేర్లు ఎందుక‌ని ప్ర‌శ్నించారు. ప‌లు స‌త్రాల అభివృద్ధికి సంబంధించిన విష‌యంలో సీఎం చంద్ర‌బాబుతో న్యాయం జరగదు అని దేవాదాయ శాఖ మంత్రిని కలిశాన‌ని వివ‌రించారు. కేంద్రంలో ప‌ద‌వి - ఎమ్మెల్యే పోస్ట్ - క్యాబినెట్ హోదా ఇవ్వలేదని ఫేస్‌ బుక్‌ లో పోస్ట్‌ పెట్టాను అన‌డం స‌రికాద‌ని ఐవైఆర్ తెలిపారు. త‌నకు రాజకీయాల్లోకి రావాలని లేద‌ని స్ప‌ష్టం చేశారు. తాను నెలకు రెండు లక్షలు సాలరీ తీసుకుంటున్నట్లుగా చెప్తున్నార‌ని కానీ ఒక్క రూపాయి తీసుకోలేదని వివ‌రించారు.

సోష‌ల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ ను అరెస్ట్ చేసినప్పుడు చాలా బాదేసిందని, పొలిటికల్ సెటైర్ వేస్తే నవ్వుకోవాలి లేక తిరిగి సెటైర్ వెయ్యాలి కానీ అరెస్టులు ఎందుక‌ని అనిపించిందని ఐవైఆర్ తెలిపారు. ఈ విష‌యంలో నన్ను ఎవరు ఎందుకు పోస్టులు పెట్టావ్ అని అడగలేదు..అడిగి ఉంటే చెప్పివుండేవాడిన‌ని వివ‌రించారు. గౌతమిపుత్ర సినిమాకి టాక్స్ మినహాయింపుకు సంబంధించి తాను పోస్ట్ చేశాన‌ని అది ప్రభుత్వానికి నచ్చలేదని వివ‌రించారు. టీటీడీ ఈఓ ప‌ద‌వి విష‌యంలో నార్త్ ,సౌత్ సమస్య కాదని అలాంటి కొత్త సంప్ర‌దాయం ఎందుకు వ‌చ్చింద‌నే తాను అడిగిన‌ట్లు వివ‌రించారు. జేసీ దివాక‌ర్ రెడ్డి విష‌యంలో అడ్డ‌గోలు వాద‌న‌లు చేసిన ఓ టీడీపీ కార్య‌క‌ర్త తీరును తాను త‌ప్పుప‌డితే దానికి వారి ఇగో హ‌ర్ట్ అయిన‌ట్లుంద‌ని అన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ పదవికి తాను చాలా న్యాయం చేశాన‌ని ఐవైఆర్ వివ‌రించారు. పొలిటికల్ మైలేజ్ కోసం అయితే వేరే వారిని అపాయింట్ చేసుకోవచ్చున‌ని కాని బ్రాహ్మ‌ణుల సంక్షేమాన్ని వ‌దిలిపెట్ట‌వ‌ద్దన్నారు. ఆంధ్ర ప్రజలకు నిజాలు తెలియడం లేదని, చాలా విషయాలు గురించి త్వరలోనే స్పందిస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఏపీలో నిజాలు వ్య‌క్త‌ప‌రిచే మీడియా సంస్థ‌లు లేక‌పోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/