Begin typing your search above and press return to search.
దాన్నే బుట్టలో వేసిన బాబుకు నేనొక లెక్కా?
By: Tupaki Desk | 7 Sep 2017 9:45 AM GMTతెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవహారశైలిపై ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. పర్యావరణం- అమరావతి అనే అంశంపై విజయవాడలో జరిగిన సదస్సులో ఏపీ సీఎం తీరును మాజీ సీఎస్ నిశితంగా విశ్లేషించారు. రాజధాని కోసం స్థలం ఎంపిక - అమరావతి నిర్మాణం విషయంలో తనకు మొదటి నుంచి భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఐవైఆర్ తెలిపారు. అప్పుడు ఎందుకు స్పందించలేదనే వారు కొన్ని అంశాలను గమనించాలని అన్నారు. వ్యవస్థలో పనిచేసేప్పుడు పరిమితులు ఉంటాయని చీఫ్ సెక్రటరీ కూడా అందులో భాగమే అని అన్నారు. సలహాను స్వీకరించే ఉద్దేశం ఉన్నప్పుడే ఎవరైనా స్పందిస్తారని లేదంటే ఎందుకు స్పందిస్తారని ఐవైఆర్ పేర్కొన్నారు.
అనాడు అమరావతి విషయంలో ఏం చేశానో అనేది అధికారిక రహస్యాల పరిధిలోకి వస్తుందని ఐవైఆర్ వివరించారు. రాజధాని ప్రక్రియలో చాలా విషయాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ పక్కకు పెట్టారని ఆయన వివరించారు. `ప్రభుత్వంలో ఒక నిర్ణయం అయినప్పుడు దానిని సమర్థించడం చీఫ్ సెక్రటరీగా నా బాద్యత. సీఎస్ గా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు అన్న వారు ఇవి గుర్తించాలి`` ఐవైఆర్ కృష్ణారావు స్పష్టం చేశారు. నదీ పరీవాహక ప్రాంతాలను పరిరక్షించుకునేందుకు చట్టాలు ఉన్నాయని వాటిని మనమే ఉల్లంఘించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ మహానగరంగా మారడానికి వంద సంవత్సరాలు పట్టిందని వివరించారు. అందుకే మహానగరాల్లో రాజధాని వుండకూడదని అమెరికా నిర్ణయం తీసుకుందని వివరించారు. ఆస్ట్రేలియా కూడా మహానగరాలకు దూరంగా రాజధానిని ఏర్పాటు చేసుకుందని ఐవైఆర్ వివరించారు. మలేషియా, బర్మా దేశాల్లో నూతన రాజధానులు ప్రజలు లేక ఘోష్ట్ టౌన్ లుగా మిగిలిపోయాయని పేర్కొన్నారు. బ్రెజిల్ కూడా జోనింగ్ తో మహానగరం నిర్మించుకునే క్రమంలో అనేక మురికివాడలు ఏర్పడ్డాయని చెప్పారు.
పెద్ద ఎత్తున ఆలోచనలు తప్పులేదు... కానీ అందుకు తగిన స్థాయిలో మనం ఉన్నామా అనే అంశంను పరిశీలించుకోవాలని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు. సమతూల్యం కలిగి, అందరిని ఆదరించే నగరాలే అభివృద్ధి చెందుతాయని ఐవైఆర్ వివరించారు. పరిపాలనా పరమైన చిన్న నగరం వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన విశ్లేషించారు. ప్రజాస్వామ్యిక దేశాల్లో ఇటువంటి భారీ ప్రాజెక్ట్ లు సరికాదని అనేక మంది నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ అంతా హైదరాబాద్ నగరమేనని...మిగిలిన పట్టణాలు అంతగా అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. కానీ ఏపీలో అలాకాదని పలు నగరాలు అభివృద్ధి చెంది ఉన్నాయని ఐవైఆర్ తెలిపారు. ప్రధాన భూపరిపాలన కమిషనర్‌గా ఉన్నప్పుడే రాష్ట్రంలో ప్రభుత్వ భూముల లెక్కలు పరిశీలించామని పేర్కొన్నారు. తిరుపతి- విజయవాడ- విశాఖపట్నంలను మెట్రో నగరాలుగా అభివృద్ధి చేస్తూ, దొనకొండను పరిపాలనా నగరంగా నిర్మించవచ్చని సూచించానని ఐవైఆర్ వివరించారు. రాజధాని నిర్మాణం విషయంలో శివరామకృష్ణ కమిటీ అనేక మంది నిపుణులతో కూడినదని తెలిపారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదికకు తప్పక గౌరవించాల్సి ఉందని...ఈ కమిటీకే విలువ ఇవ్వనప్పుడు ప్రభుత్వంలో భాగమైన ప్రధాన కార్యదర్శిగా తన అభిప్రాయాలకు ప్రభుత్వం ఎలా విలువ ఇస్తుందని ఐవైఆర్ వ్యాఖ్యానించారు.
ఓ పెద్ద నగరం ఏపీ రాజధానికి సరికాదని శివరామకృష్ణ కమిటీ అభిప్రాయపడిందని ఐవైఆర్ వివరించారు. అయిదు నుంచి పది లక్షల జనాభా చేరాలంటే కనీసం నలబై సంవత్సరాల సమయం పడుతుందని...కానీ అయిదేళ్ళలోనే ఇంత అభివృద్ధి ని ఇక్కడ ఇస్తామని చెప్పడం ఊహాజనితమని అన్నారు. అమరావతి మొదటి అవుట్ సోర్సింగ్ రాజధాని అని నిపుణులు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. భూసమీకరణ విషయంలో ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడుతోందని ఐవైఆర్ చెప్పారు. 2035 నాటికి 45లక్షల జనం అమరావతిలో ఉంటారని చెప్పడం వాస్తవ దూరమన్నారు. అమరావతి కలల రాజధాని అని వ్యాఖ్యానించారు. సామాజిక పర్యావరణ సర్వే జరగలేదు ఐవైఆర్ కృష్ణారావు స్పష్టం చేశారు. 270 ఎకరాలు రాజధానికి సరిపోతుందని శివరామకృష్ణ కమిటీ చెప్పిందని గుర్తు చేశారు.
భూసమీకరణ విఫల ప్రయోగం అని ఐవైఆర్ కృష్ణారావు తేల్చిచెప్పారు. ఎవడైన తమ ప్రయోజనాల కోసమే ఇక్కడకు వస్తారని అమరావతి వల్ల విజయవాడ - గుంటూరు నగరాలకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదని తెలిపారు. భూసమీకరణకు రానివారి నుంచి భూసేకరిస్తానని చెప్పడం చట్ట విరుద్దమన్నారు. ప్రభుత్వ భవనాలకు ప్రజా ప్రయోజనం అవుతుందే కానీ ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేది ప్రజా ప్రయోజనం ఎలా అవుతుందని ఆయన సూటిగా ప్రశ్నించారు. మద్య తరగతి వర్గం అమరావతి వలలో పడవద్దని కోరారు. ఇక్కడ ల్యాండ్ స్పెక్యులేషన్ జరుగుతోందని వివరించారు. విజయవాడ, గుంటూరు నగరాలు ఇప్పటికే ఉష్ణోగ్రతతో అల్లాడుతున్నాయని ఐవైఆర్ వివరించారు.ఈ రెండు నగరాల మధ్య యాబై వేల ఎకరాలను డీ ఫారెస్ట్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. మొదటి నుంచి రాజధాని కదులుతూ వస్తోందని ఎద్దేవా చేశారు. నూజివీడు, గన్నవరం, మంగళగిరి, ఇప్పుడు అమరావతికి చేరిందని అన్నారు.