Begin typing your search above and press return to search.

అలవికానీ హామీలతో యమ డేంజర్ అన్న ఐవైయార్

By:  Tupaki Desk   |   8 Feb 2022 4:30 PM GMT
అలవికానీ హామీలతో యమ డేంజర్ అన్న ఐవైయార్
X
అధికారం మాత్రమే కనిపించి మిగిలినవి పట్టించుకోకుండా రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా హామీలు ఇస్తూ పోతాయి. ఎలాగోలా తమకు అధికారమే దక్కాలి. ఇదే రాజనీతి వారిది. దాంతో పాలనలోకి వచ్చాక ఆర్ధిక నీతి లోపిస్తోంది. ఫలితంగా అధికారం దక్కినా దాని వెంటనే అశాంతిని కూడా ఆయా పార్టీలు కోరి మరీ తెచ్చుకుంటున్నాయి.

ఏపీలో ప్రస్తుతం నెలకొంటున్న పరిస్థితుల మీద రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బీజేపీ లీడర్ ఐవైయార్ క్రిష్ణారావు తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. రాజకీయ పార్టీలు గుడ్డిగా హామీలు ఇచ్చేయడం కాదు, తాము ఇచ్చేవి నెరవేర్చగలమా లేదా అని ఒకటికి రెండు సార్లు ఎన్నికల మ్యానిఫేస్టోని రెడీ చేసినపుడే చూసుకోవాలని సూచించారు.

రాజకీయ పార్టీలు అధికార యావతో చేసే హామీలను ప్రజలు నిశితంగా గమనిస్తారని, వారు పవర్ లోకి వచ్చాక వాటిని నిలబెట్టుకోలేకపోతే జనాలు కూడా ఆగ్రహిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. దీని మీద ప్రజల కంటే మంచి తీర్పరులు వేరే ఎవరూ లేరని, వారి అభిప్రాయాలు నిక్కచ్చిగా ఉంటాయని ఆయన అన్నారు.

ఇక 2014, 2019 ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన పార్టీలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం అయ్యాయని ప్రజలు భావిస్తున్నారు అని ఆయన అభిప్రాయపడ్డారు. హామీలు ఇచ్చి ఎందుకు అమలు చేయడంలేదని వారు ప్రశ్నిస్తున్నారని కూడా అన్నారు.

ఈ మధ్య ప్రభుత్వ ఉద్యోగులు కొత్త పీయార్సీ విషయంలో సమ్మె చేయాలని నోటీస్ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ రాజకీయ పార్టీలు విచక్షణ మరచి హామీలు ఇచ్చుకుంటూ పోతే ఫలితాలు ఇలాగే ఉంటాయని అన్నారు. ఏ కారణం చేత అయినా రాజకీయ పార్టీలు హామీలను అమలు చేయకపోతే ప్రజలలో అది అశాంతి రేగడానికి కారణం అవుతుంది అని ఆయన అన్నారు.

అందువల్ల రాజకీయ పార్టీలు ఈ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసుకోవాలని హితవు పలికారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అన్ని పార్టీలకు కనువిప్పు కావాలని కూడా ఆయన పేర్కొన్నారు. మొత్తానికి వైసీపీ అలవి కానీ హామీలు ఇచ్చి ఇపుడు ముప్పతిప్పలు పడుతున్న టైమ్ లో కరెక్ట్ గా గురి చూసి మరి ఐవైఆర్ కృష్ణారావు బాణం వేశారు. అనుకోవాలి. మరి ఈ హాట్ కామెంట్ మీద వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.