Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ వ‌చ్చేయ్‌.. మ‌నం చేతులు క‌లుపుదాం.. కాంగ్రెస్ బిగ్ ఆఫ‌ర‌ట‌!

By:  Tupaki Desk   |   14 March 2022 11:30 PM GMT
ప‌వ‌న్ వ‌చ్చేయ్‌.. మ‌నం చేతులు క‌లుపుదాం.. కాంగ్రెస్ బిగ్ ఆఫ‌ర‌ట‌!
X
న‌వ్విపోదురుగాక‌.. అన్న‌ట్టుగా ఉన్న కాంగ్రెస్ ప‌రిస్థితి గురించి అంద‌రికీ తెలిసిందే. ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టుగా ఉన్న ఏపీలో కాంగ్రెస్ ప‌రిస్థితిని ఎవ‌రూ చ‌క్క‌దిద్ద‌లేని స్థితి ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. ఎవ‌రికి వారు పార్టీని వ‌దిలి పోయారు. ఎవ‌రికివారు.. పార్టీని చుల‌క‌న చేశారు. ఎక్క‌డివారు అక్క‌డ స‌ర్దుకున్నారు.

దీనికితోడు ప్ర‌జ‌ల్లో ఉన్న ఇమేజ్ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కేవ‌లం 1 శాతం ఓట్ల‌కు పార్టీ ప‌రిమిత‌మైన పోయిన ప‌రిస్థితి నెల‌కొంది. ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా.. గ‌తంలో కాంగ్రెస్ గ‌ట్టి పోటీ ఇస్తుంద‌నే ప‌రిస్థితి నుంచి ఇప్పుడు అస‌లు క‌నిపించ‌ని ప‌రిస్థితికి దిగ‌జారిపోయింది.

ఇలా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఇప్పుడు.. జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్ కు బిగ్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. ``వ‌చ్చేయ్ ప‌వ‌న్‌.. మ‌నం చేతులు క‌లుపుదాం!` అంటూ.. ఆఫ‌ర్ ఇస్తున్న‌ట్టు చెప్పారు. అంతేకాదు.. ప్ర‌స్తుతం బీజేపీతో ఉన్న జ‌న‌సేన ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని.. కూడా పిలుపునిచ్చారు.

బీజేపీని వదిలేసి కాంగ్రెస్‌తో చేతులు కలపాలని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం కోరారు. కాంగ్రెస్ పార్టీతో పవన్ కలిస్తే బడుగుబలహీన వర్గాలకు ఉపయోగం చేకూరుతుందని సూచించారు. ఈ క్ర‌మంలో త‌మ‌కు ప‌వ‌న్ తోడైతే.. రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చేస్తామ‌ని అన్నారు.

28 మంది ఎంపీలున్నా.. వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాపై నేరు మెదపలేకపోవడం సిగ్గుచేటని శీలం వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ బీజేపీని వదిలేసి కాంగ్రెస్‌తో చేతులు కలపాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీతో పవన్ కలిస్తేనే బడుగుబలహీన వర్గాలకు మేలు జరుగుతుందని అన్నారు.

వైసీపీ ప్రభుత్వం రాజధాని అమరావతిని కుక్కలు చింపిన విస్తరిలా చేశారని మండిపడ్డారు. పోలవరాన్ని ఇప్పటివరకూ సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు. 28 మంది ఎంపీలున్నా.. వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాపై నోరు మెదపలేక పోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.

ఇసుక అమ్మకంలో టీడీపీ ప్రభుత్వం కిటికీలు తెరిస్తే... వైసీపీ ప్రభుత్వం తలుపులు తెరిచిందని దుయ్యబట్టారు. యూపీలో బీజేపీని గెలిపించడం కోసమే.. ఎంఐఎం, బీఎస్పీ, తదితర పార్టీలు పోటీ అనే డ్రామాకు తెరలేపాయన్నారు. మ‌రి ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.