Begin typing your search above and press return to search.
చెన్నై తగలబడ్తుంటే అమ్మ అప్లికేషన్లు ఇస్తోంది!
By: Tupaki Desk | 15 Sep 2016 4:40 AM GMTకావేరి నీటి విడుదల అంశం తమిళ ప్రజల్లో మరింత ఆవేదనను కలిగిస్తోంది. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో ఉన్న తమ బంధుమిత్రుల పరిస్థితిని చూసి తమిళ తంబీలు మదనపడుతున్నారు. కర్ణాటకకు పని మీద వెళ్లిన వారి గురించి ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కర్ణాటక సరిహదుల్దో తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్ ను అర్థనగ్నంగా రోడ్డుపై కూర్చోబెట్టి ఆందోళనకారులు కొట్టిన సన్నివేశాలు మరింత ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ఈ తరహా ఘటనలపై రాజకీయ నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. రాష్ట్రంలోని కర్ణాటక సంస్థలకు మాత్రం తగిన పోలీసు - సాయుధ దళ బందోబస్తు కొనసాగుతోంది. సదరు సంస్థలు - కార్యాలయాల ఎదుట ఎలాంటి ఆందోళనలు జరగనివ్వకుండా పోలీసు యంత్రాంగం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. కర్ణాటక తీరును ఖండిస్తూ రాష్ట్రంలో చెదురుమదురు ఘటనలు - ఆందోళన కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. పరిస్థితి ఇంత ఉద్రిక్తంగా ఉండగా తమిళనాడు సీఎం జయలలిత వచ్చే ఎన్నికలకు సిద్ధమయ్యారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయదలిచిన ఆశావహకులను దరఖాస్తు చేసుకోవలసిందిగా అన్నాడీఎంకే అధినేత్రి - ముఖ్యమంత్రి జయలలిత పిలుపునిచ్చారు. శుక్రవారం (ఈనెల 16) నుంచి దరఖాస్తులు స్వీకరించనుండగా ఇందుకు జిల్లాల వారీగా పార్టీ నిర్వాహకులనూ జయలలిత ప్రకటించారు. స్థానిక సంస్థల గడువు అక్టోబరు 24తో పూర్తి కానుండగా ఆలోగా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. రెండు విడతలుగా అక్టోబరు 17 - 19 తేదీల్లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని, ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో విడుదల కానుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సమరానికి అధికారిక అన్నాడీఎంకే తొలి అడుగు వేసింది. ఆశావహుల నుంచి దరఖాస్తులను కోరుతూ జిల్లాలవారీగా దరఖాస్తులను స్వీకరించే పార్టీ నిర్వాహకులను నియమిస్తూ ముఖ్యమంత్రి జయలలిత ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో 16న ఉదయం 8.30 గంటల నుంచి దరఖాస్తుల పంపిణీ ప్రారంభం కానుందని, 22 వరకు ప్రతీరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దరఖాస్తులను తగిన రుసుము చెల్లించి పొందవచ్చని పేర్కొన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను 22న రాత్రి 8 గంటల్లోపు సమర్పించాలని పేర్కొన్నారు. చెన్నై నగర పాలక సంస్థ పరిధిలో ఆశావహులకు పార్టీ ప్రధాన కార్యాలయంలో - ఇతర ప్రాంతాలకు జిల్లా కార్యాలయాల్లో దరఖాస్తులు లభ్యమవుతాయని తెలిపారు. ఎన్నికల విధులను పర్యవేక్షించడానికి మంత్రి ఓ.పన్నీర్‌సెల్వం - లోక్ సభ ఉపసభాపతి తంబి దురై, శాసనసభ ఉపసభాపతి పొల్లాచ్చి జయరామన్ - ఆర్గనైజింగ్ కార్యదర్శి సెమ్మలై - పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ వేణుగోపాల్ లతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
స్థానిక సంస్థల పదవి దరఖాస్తు ఫీజు
కార్పొరేషన్ వార్డు కౌన్సిలరు 11,000
మున్సిపల్ వార్డు కౌన్సిలరు 5,000
పట్టణ పంచాయతీ వార్డు సభ్యుడు 2,000
జిల్లా పంచాయతీ యూనియన్ కౌన్సిలరు 11,000
పంచాయతీ యూనియన్ వార్డు కౌన్సిలరు 5,000