Begin typing your search above and press return to search.
ఆది పంచ్ డైలాగులతో.. కడుపుబ్బ నవ్వుకున్న పవన్..
By: Tupaki Desk | 12 Jan 2023 2:56 PM GMTజనసేన ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో నిర్వహించిన యువశక్తి సభలో జబర్దస్త్ ఫేమ్.. ఆది పంచ్‌లపైపంచ్‌లు వేశారు. ఏపీ ప్రభుత్వంలోనిమంత్రులను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానిస్తూనే .. పంచ్‌లతో విరుచుకుపడ్డా రు. ``ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికీ.. ప్రశ్నించే హక్కు ఉంటుంది. గెలిచిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాదు.. లేదు.. అంటే.. మనసులో ఉన్నది కక్కేస్తా.. 2024లో గాజు గ్లాసుపై నొక్కేస్తా`` అని తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు.
ఈ సందర్భంలో పవన్ కడుపుబ్బ నవ్వుకున్నారు. తన నవ్వును ఆపుకోలేక.. చేతిలో ఉన్న కళ్లజోడును అడ్డు పెట్టుకోవడం గమనార్హం. ``నన్ను కన్న నాతల్లి మీద ఒట్టేసి చెబుతున్నా.. అలాంటి నీతిగల.. నిజాయితీగల నిస్వార్థపరుడైన రాజకీయ నాయకుడిని మీరు మళ్లీ చూడలేరు`` అని ఆది ఒకింత ఎమోషన్ అయ్యారు. పవ న్‌కు కుల పిచ్చి లేదని.. అన్ని కులాల వారినీ ప్రోత్సహిస్తారని.. తాను ముందుండి నడిపిస్తారని చెప్పారు.
పవన్ నిజాయితీని ఉద్దేశిస్తూ.. పలు వ్యాఖ్యలు చేసిన ఆది.. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను నిజాయితీకి నిలువుటద్దంగా పేర్కొన్నారు. అలాంటి ఆయన పవన్ పక్కన ఉన్నారంటే..పవన్ ఎంత నిజాయితీ పరుడో అర్ధం అవుతుందని చెప్పారు. కార్యకర్తల విషయానికి వస్తే.. ఏ పార్టీ కార్యకర్తలైనా ఒకటేనని.. మీరు మీరు గొడవ పడొద్దని ఆది సూచించారు. పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.