Begin typing your search above and press return to search.
కోదండారం విడుదల...ఏం కుట్ర ఉందని ప్రశ్న
By: Tupaki Desk | 22 Feb 2017 4:41 PM GMTతెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను కామాటిపురా పీఎస్ నుంచి పోలీసులు విడుదల చేశారు. ఐకాస ర్యాలీ చేపట్టనున్న సందర్భంగా ఇవాళ వేకువజామున కోదండరాం ను ఇంటి వద్ద నుంచి పోలీసులు తీసుకెళ్ళారు. నిరుద్యోగుల ర్యాలీకి కోదండరాం పిలుపునివ్వడంతో ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేసి రోజంతా తమ అదుపులోనే ఉంచుకొని ఎట్టకేలకు విడుదల చేశారు. విడుదల అయిన అనంతరం తన నివాసంలో మీడియాతో కోదండరాం మాట్లాడారు. జేఏసీలో సమీక్షించి భవిష్యత్ కార్యచరణపై చర్చిస్తామని వెల్లడించారు. అరెస్టులు - జరిగిన పరిణామాలపై విశ్లేషించుకుంటామన్నారు.
నిరుద్యోగుల ర్యాలీ విజయవంతం చేసినందుకు కృతఙ్ఞతలని - తెలంగాణ అప్పుడు అరెస్ట్ చేయని వారిని ఇప్పుడు అరెస్ట్ చేసారని పేర్కొన్నారు. మిగిలిన వారిని కూడా విడుదల చేయాలని - మమ్మల్ని అరెస్ట్ చేసిన తీరు అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. "మా ఇంటి మీద పడి పోలీసులు తలుపులు బాదారు. చెప్పినా వినకుండా దౌర్జన్యం చేసారు. ఈస్ట్ జోన్ డీసీపీ కి చెప్పిన వినకుండా రెండు తలుపులు పగుల కొట్టి ఇంట్లోకి వచ్చారు. మా విజ్ఞప్తులను పోలీస్ లు పట్టించుకోలేదు. దౌర్జన్యం అవసరం లేదు. సమయం ఇవ్వమని కోరిన పోలీస్ లు వినలేదు.నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మా కార్యాచరణ కొనసాగుతుంది. రేపు జేఏసీ మీటింగ్ ఉంది. అరెస్ట్ ల వివరాలు వాట్సాప్ ద్వారా పంపించాలి. 20 రోజుల ముందు పర్మిషన్ కు దరఖాస్తు పెట్టుకున్నాం. కాని పోలీస్ లు తాత్సారం చేసి చివరికి నాగోల్ లో సభ పెట్టుకోవాలని పోలీసులు చెప్పారు. మాకు అవకాశం ఇచ్చి ఉంటె నిజం కాలేజ్ గ్రౌండ్ లో సభ పెట్టుకునే వాళ్ళం. ర్యాలీ, ధర్నా ఉప సంహరించుకున్నాం. పోలీసుల జోక్యము కారణంగా గ్రౌండ్ రాలేదు" అని కోదండరాం వ్యాఖ్యానించారు.
తాము ఎలాంటి కుట్రలు చేయడం లేదు. అప్రజాస్వామిక పద్దతిలో వేధింపులకు గురిచేస్తున్నారని కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు."ఏ అసాంఘిక శక్తులు ఇందులో ఉన్నాయి. *మేం ప్రశాంతం గా చేస్తామన్నా.. వెంట పడి వేదించారు. రేపటి విద్యాసంస్థల బంద్ కు నైతిక మద్దతు ఉంటుంద. రాజకీయ పార్టీల మద్దతు jacకి అవసరం వస్తే వారితో చర్చిస్తాం" అని స్పష్టం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/