Begin typing your search above and press return to search.

జాక్ పాట్ ... కేరళ రైతుకి రూ.12 కోట్ల లాటరీ !

By:  Tupaki Desk   |   12 Feb 2020 11:00 AM GMT
జాక్ పాట్ ... కేరళ రైతుకి రూ.12 కోట్ల లాటరీ !
X
ఆయనది ఒక నిరుపేద కుటుంబం ..రోజు కూలీ పనికి వెళ్లి డబ్బు తెచ్చుకుంటే కానీ తిండి తినలేని జీవితం. పనిలేకపోతే పస్తులుండాల్సిందే. ఈ క్రమంలోనే కుటుంబ పోషణకోసం చాలా అప్పులు చేసి , వచ్చే కూలీ డబ్బులతోనే జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. కుటుంబ పోషణకోసం , అప్పులని తీర్చడానికి బ్యాంకుల్లో లోను తీసుకున్నాడు. ఆ అప్పు తీర్చలేకపోవడంతో బ్యాంకు అతడి ఇంటిని స్వాధీనం చేసుకోబోతోంది. దీనితో ఆ అప్పుల ఊబిలో ఉంది బయటకి వచ్చేందుకు అతడు చేయని ప్రయత్నం అంటులేదు. అయితే , కటిక పేదరికం అనుభవిస్తున్నప్పటికీ కూడా ఇతడికి ఒక అలవాటు ఉంది. అదే అలవాటు ఈ రోజు అతన్ని కోటీశ్వరున్ని చేసింది.

అతని పూర్తి వివరాలు చూస్తే ... మాల్పూర్ పంచాయతీలోని కురిచ్యా కాలనీలో నివాసముండే రాజన్ పెర్నూన్ అనే రోజువారీ కూలీ.. వ్యవసాయ పనులు చేస్తుంటాడు. అతడి భార్య రజనీ స్థానిక అంగనవాడీలో తాత్కాలిక సిబ్బందిగా పనిచేస్తోంది. రాజన్ కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయనకి ఉన్న లాటరీ పిచ్చి వల్ల తాజాగా కొన్న ఒక లాటరీ టికెటుపై రూ.12 కోట్ల ప్రైజ్ మనీ తగిలింది. కేరళ రాజధాని తిరువనంతపురంలో క్రిస్మస్, న్యూ ఇయర్ బంపర్ లాటరీ కింద రూ. 12 కోట్ల ఫ్రైజ్ మనీ ప్రకటించింది. కన్నూరు జిల్లాలోని కూతుపారంబు పట్టణంలో ఒక వెండర్ నుంచి ST 269609 లాటరీ టికెట్ కొన్నాడు. దీనితో ఈసారి అతడికి అదృష్టం బాగా కలిసొచ్చి రూ.12 కోట్ల బంపర్ లాటరీ తగిలింది. వెంటనే అతడు గెలిచిన ఆ టికెట్‌తో స్థానిక కోఆపరేటీవ్ బ్యాంకు వద్దకు వెళ్లి అధికారికంగా అందజేశాడు.

కాగా , లాటరీ టికెట్ నిబంధనల ప్రకారం.. రాజన్ గెలుచుకున్న రూ.12 కోట్ల ప్రైజ్ మనీలో ట్యాక్సులు, ఏజెన్సీ కమీషన్ పోనూ కేవలం రూ.7.2 కోట్లు మాత్రమే అతడి చేతికి వస్తాయి. లాటరీ టికెట్ అమ్మే ఏజెన్సీకి GST తో కలిపి 10శాతం పోతుంది. కోట్ల రూపాయల లాటరీ గెలుచుకున్నందుకు రాజన్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ప్రతిరోజు లాటరీలు కొంటుంటానని చెప్పుకొచ్చాడు. చిన్న లాటరీ ప్రైజుల నుంచి పెద్ద ప్రైజ్ ల వరకు అన్ని కొంటాను. గతంలో చిన్ని లాటరీలను గెలుచుకున్నాను రూ.1000, రూ.2000, రూ.5000 వరకు గెలుచుకున్నాను. అలా లాటరీ గెలుస్తూనే పెద్ద లాటరీలు కొనేలా ప్రోత్సహించినట్టు తెలిపాడు. ప్రైజ్ మనీ రాగానే బ్యాంకులో అప్పు తీర్చేస్తా అని , అలాగే తన చిన్న కూతురిని బాగా చదివిస్తానని తెలిపాడు. ఏదేమైనా ఈ కూలీ జీవితం ఒక్క లాటరీ తో మారిపోయింది అని చెప్పాలి ...