Begin typing your search above and press return to search.
జాకీని నోరాని పదే పదే వెంటాడుతున్న నీడ
By: Tupaki Desk | 26 Aug 2022 5:03 AM GMT200 కోట్ల స్కామ్ లో నిందితుడు కాన్ మేన్ సుఖేష్ చంద్రతో సంబంధాలు ఇద్దరు టాప్ హీరోయిన్లను చిక్కుల్లోకి నెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల మీడియా హెడ్ లైన్స్ లో సదరు భామల పేర్లు ప్రముఖంగా హైలైట్ అవుతున్నాయి. సుఖేష్ కంటే ఆ ఇద్దరి పేర్లనే మీడియా హైలైట్ చేయడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.
అందులో ఒకరు శ్రీలంకన్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ కాగా.. మరో బ్యూటీ నోరా ఫతేహి. అయితే సుఖేష్ చంద్రశేఖర్ కేసులో తాను కూడా ఒక బాధితురాలినని జాక్విలిన్ ఆరోపించింది. నోరా ఫతేహీ లాంటి సెలబ్రిటీలు ఎలా సాక్షులు అవుతారు? అని కూడా సందేహం వ్యక్తమైంది.
పీఎంఎల్ ఏ అప్పీలేట్ అథారిటీ ముందు దాఖలు చేసిన పిటిషన్ లో సుకేష్ చంద్రశేఖర్ దోపిడీ కేసులో నిందితురాలిగా ఉన్న జాక్విలిన్ ఈడీ ఛార్జిషీట్ పై స్పందించారు. ఇంతకుముందు తాను బలంగా ఉన్నానని ఎలాంటి సన్నివేశాన్ని అయినా ఎదుర్కొంటానని నమ్మకాన్ని వ్యక్తం చేసిన జాక్విలిన్ ఈడీకి బలంగానే ఎదురు తిరుగుతోంది.
ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమర్పించిన ఛార్జిషీట్ లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను నిందితురాలిగా దాఖలు చేసినట్లు చాలా కాలం క్రితం వెల్లడైంది. అయితే సుఖేశ్ చంద్రశేఖర్ రూ. 200 కోట్ల దోపిడీ కేసులో నోరా ఫతేహి వంటి మరికొందరు ప్రముఖులను ఛార్జిషీట్ లో సాక్షిగా చేర్చారు. ఇతర సెలబ్రిటీల మాదిరిగానే తాను కూడా ఈ కేసులో ప్రధాన నిందితుడు సుఖేష్ కు చిక్కినట్లు ఆమె ఆరోపించింది.
ఈ కేసు పూర్వా పరాల ప్రకారం..జాక్విలిన్ అతడి నుంచి భారీగా డబ్బు బహుమతులు అందుకుంది. జాకీ కుటుంబానికి కానుకలందాయి. బహుమతులు ఆస్తుల గ్రహీతగా పేర్కొన్న పత్రాలను ఈడీ అందుకున్న తర్వాత దాఖలు చేసిన ఛార్జిషీట్ లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను నిందితురాలిగా పేర్కొన్నారు. సుఖేష్ చంద్ర అతని సహచరుడి నుండి 7 కోట్లు జాక్విలిన్ కి ముట్టాయి. తనతో పాటు ఆమె కుటుంబం కూడా సదరు మోసగాడి నుంచి ఆర్థిక సాయం పొందినట్లు ఈడీ రుజువులను కూడా సమర్పించింది. జాక్వెలిన్ తో పాటు నోరా ఫతేహి వంటి కొంతమంది సెలబ్రిటీల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే నోరా కూడా సుఖేష్ నుండి బహుమతులు అందుకున్నవారిలో ఒకరు. అయితే ఈ కేసులో నోరాను సాక్షిగా పేర్కొనగా ఈ నెల ప్రారంభంలో జాక్వెలిన్ ను నిందితుల్లో ఒకరిగా చేర్చారు.
పీఎంఎల్ ఏ అప్పీలేట్ అథారిటీ ముందు పిటిషన్ లో.. సాక్ష్యంలో భాగంగా సమర్పించిన ఫిక్స్ డ్ డిపాజిట్లకు నేరంతో ఎలాంటి సంబంధం లేదని తన స్వార్జితాన్ని చట్టబద్ధమైన ఆదాయాన్ని డిపాజిట్లు చేశానని జాకీ పేర్కొంది. సుకేష్ చంద్రశేఖర్ ఉనికి గురించి తనకు తెలియక ముందే డిపాజిట్లు చేశానని కూడా పిటిషన్ లో నొక్కి చెప్పింది. ఇంకా జాక్విలిన్ తన సమన్ లకు ఎలా హాజరయ్యిందో కూడా తెలిపింది. తనకు తెలిసినంతవరకు సాధ్యమైనంత ఎక్కువ సమాచారాన్ని అందజేయడం ద్వారా దర్యాప్తుకు ఎలా సహకరించిందో కూడా పిటిషన్ లో వెల్లడించింది.
ఇతరుల మాదిరిగానే మోసగాడు సుఖేష్ చేతిలో మోసపోయిన బాధితురాలిని అని జాక్విలిన్ గట్టిగా చెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఎంక్వయిరీ ఏజెన్సీలు దానిని మెచ్చుకోవడంలో విఫలమయ్యాయి. మొత్తం ప్రాసిక్యూషన్ కేసును వాదనల నిమిత్తం నిజమని తీసుకుంటే.. అప్పుడు కూడా PMLA పథకం లేదా అమలులో ఉన్న మరే ఇతర చట్టం కింద జాక్విలిన్ పై ఎటువంటి కేసు నమోదు చేయకూడదు. ఇది మాలాఫైడ్ ప్రాసిక్యూషన్ కేసు'' అని జాక్విలిన్ లాయర్ ప్రకటన పేర్కొంది. తన అభ్యర్థనలో ఎలా తాను బహుమతులు అందుకుందో ప్రస్తావించింది. బలవంతంగా ముట్టినవి లేదా ట్రాప్ ద్వారా అందుకున్నవి అని కూడా చెప్పే ప్రయత్నం చేసింది.