Begin typing your search above and press return to search.

కోర్టు మెట్లు ఎక్కిన జాక్వెలిన్ పెర్నాండేజ్

By:  Tupaki Desk   |   11 May 2022 11:30 AM GMT
కోర్టు మెట్లు ఎక్కిన జాక్వెలిన్ పెర్నాండేజ్
X
బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ పెర్నాండేజ్ మ‌నీలాండ‌రింగ్ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కోంటున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధాన నిందితుడుగా ఉన్న‌ సుకేష్ చంద్ర తో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే జాకీ కేసులో కీల‌కంగా మారింది. ఇటీవ‌లే జాకీ కి సంబంధించిన ఏడు కోట్ల ఆస్తుల్ని కూడా జ‌ప్తు చేసారు.రెండు ద‌ఫాల ఈడీ విచార‌ణ అనంత‌రం జాకీ నుంచి ఈడీ కీల‌క స‌మాచారం రాబ‌ట్టి కోర్టు అనుమ‌తితో ఆస్తులు జ‌ప్తు చేసారు.

ప్ర‌స్తుతం జాకీ దేశం విడిచి వెళ్ల‌డానికి లేదు. విచార‌ణ ముగిసే వ‌ర‌కూ పూర్తిగా అధికారుల‌కు..కోర్టుకు..పోలీసుల‌కు అందుబాటులో ఉండాలి. ఈ నేప‌థ్యంలో లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఒక వేళ దేశం విడిచి వెళ్లాలంటే సంబంధిత విచార‌ణ కోర్టు అనుమ‌తి త‌ప్ప‌ని స‌రి.

ఇప్ప‌టికే ఈ ర‌కమైన అవ‌కాశాన్ని జాకీ వినియోగించుకుంది. దుబాయ్ లో స‌ల్మాన్ ఖాన్ నిర్వ‌హించిన షో కి హాజ‌ర‌వ్వ‌డం కోసం బ‌య‌ల్దేరిన జాకీనీ ముంబై ఎయిర్ పోర్టు పోలీసులు అడ్డుకున్నారు.

లుకౌట్ నోటీసులు అడ్డు రావ‌డంతో ప్ర‌త్యేక అనుమ‌తులు తెచ్చుకుని దుబాయ్ ప్లైట్ ఎక్కింది. అయితే తాజాగా మ‌రోసారి జాకీ కోర్టును ఆశ్రయించింది. 15 రోజుల‌ పాటు విదేశాలు వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ ఢిల్లీ కోర్టుకి ద‌ర‌ఖాస్తు చేసుకుంది.

అబుదాబిలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే 'ఐఫా' అవార్డుల కార్య‌క్ర‌మానికి హ‌జర‌వ్వడం కోసం తో పాటు.. నేపాల్..ప్రాన్స్ దేశాల‌కు కూడా వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని ద‌ర‌ఖాస్తులో కోరింది. మ‌రి కోర్టు అనుమ‌తి ఇస్తుందా? లేదా? అన్న‌ది చూడాలి.

ఇటీవ‌లే జాకీ ఆస్తుల్ని కోర్టు జ‌ప్తు చేసింది. జాకీతో పాటు..ఆమె కుటుంబ స‌భ్యుల‌కు సుకేష్ డ‌బ్బులివ్వ‌డం..బంగారు ఆభ‌ర‌ణాలు.కార్లు బ‌హుమ‌తులు గా ఇవ్వడం వంటి వాటికి ప‌క్కా ఆధారాలున్నాయి. విచార‌ణ‌లో జాకీ వాంగ్ములం న‌మోదు చేసారు. దీంతో కేసులో జాక్వెలిన్ కీల‌కంగా మారింది. ఇంత క్లిష్ట ప‌రిస్థితుల న‌డుమ జాకీకి కోర్టు అనుమ‌తి ఇస్తుందా? లేదా ?అన్న‌ది తేలాలి.