Begin typing your search above and press return to search.

కోమటిరెడ్డి సోదరుల టీఆర్ ఎస్ ఎంట్రీకి అడ్డు పడుతోందెవరు?

By:  Tupaki Desk   |   11 March 2019 7:40 AM GMT
కోమటిరెడ్డి సోదరుల టీఆర్ ఎస్ ఎంట్రీకి అడ్డు పడుతోందెవరు?
X
కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెరాసలోకి చేరినప్పుడే.. ఆ విషయం కోమటిరెడ్డి సోదరులకు తెలియకుండా జరిగి ఉండదు అని అంతా అనుకున్నారు. లింగయ్యను తాము పొలిటికల్ గా ఎంకరేజ్ చేశామని.. అయితే ఆయన తమకు చెప్పుకుండానే తెరాసలోకి వెళ్లిపోయారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైకి ఒక ప్రకటన అయితే చేశారు. అయితే కోమటిరెడ్డి సోదరుల ఆశీస్సులు లేనిదే లింగయ్య తెరాసలోకి చేరే అవకాశమే ఉండదని విశ్లేషకులు అంటున్నారు.

అంతే కాదు..కోమటిరెడ్డి సోదరులే కాంగ్రెస్ ను వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి చేరడానికి రెడీగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి లింగయ్యతో పాటు వీళ్లంతా ఒకేసారి తెరాసలోకి చేరాల్సిందని.. కానీ తెలంగాణ రాష్ట్ర సమితిలోని కొంతమంది నేతలు ఈ విషయంలో గట్టిగా చక్రం అడ్డు వేశారని టాక్.

వారెవరో కాదు.. గుత్తా సుఖేందర్ రెడ్డి - జగదీశ్వర్ రెడ్డి. వీరిద్దరూ కోమటిరెడ్డి సోదరుల తెరాస ఎంట్రీకి బ్రేక్ వేశారని సమాచారం. దాని వెనుక వారి లెక్కలు వారికి ఉన్నాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీలోకి వస్తే నల్లగొండ ఎంపీ సీటు విషయంలో తనకు పోటీ అవుతారు.. అనేది గుత్తా సుఖేందర్ రెడ్డి లెక్కగా తెలుస్తోంది. ఇక రాజగోపాల్ రెడ్డి ఎంట్రీ ఇస్తే.. తన ప్రాధాన్యత తగ్గిపోతుందనేది జగదీశ్వర్ రెడ్డి భావన.

కాంగ్రెస్ లో కూడా.. కోమటిరెడ్డి సోదరులకూ - కాంగ్రెస్ లో ఉన్న ఇతర నేతలకూ ఆధిపత్య పోరు సాగింది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు వారు తెరాసలోకి వస్తే తమ ఆధిపత్యానికి చెక్ పడుతుందని జగదీశ్వరెడ్డి - గుత్తాలు వారి చేరికకు అడ్డుపుల్ల వేశారని.. ప్రస్తుతానికి చేరిక ఆగినట్టే అని, మరి ఈ వ్యవహారంలో కేసీర్ జోక్యం చేసుకుంటే.. సెటిల్ కావొచ్చని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.