Begin typing your search above and press return to search.
మోడీ చేయనిది కేసీఆర్ చేసేశారు
By: Tupaki Desk | 10 Jan 2018 6:21 AM GMTరైతులకు 24 గంటల నిరంత విద్యుత్ అందించడం తెలంగాణలో కొత్త సమీకరణాలకు తెర తీస్తోంది. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్న ఈ అంశం టీఆర్ ఎస్ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తోంది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుంటే కాంగ్రెస్ - బీజేపీ నాయకులు అవాకులు - చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. తెలంగాణను అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే క్రమంలో సీఎం కేసీఆర్ - టీఆర్ ఎస్ ప్రభుత్వం ఇష్టపడి పనిచేస్తుంటే.. ఏళ్ల తరబడి అధికారంలో ఉండి రైతాంగాన్ని నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కష్టపడి ఆపే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు.
`ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్ లో ఉచిత విద్యుత్ ఇస్తున్నారా? కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో సగం ప్రాంతానికి కరెంటే లేదు.ఈ విషయాలపై ఆయా పార్టీల నేతలు వ్యాఖ్యానించకుండా సొల్లు కబుర్లు మాట్లాడుతున్నారు` అని విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలం నుంచి రైతులకు వ్యవసాయ పెట్టుబడుల నిమిత్తం ప్రభుత్వం ప్రకటించిన ఎకరాకు రూ.4వేల పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.రాష్ట్రం సుభిక్షంగా - రైతు చల్లగా ఉండాలంటే వారికి నీళ్లు - విద్యుత్ - పెట్టుబడులు కావాలని, దీనినే ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారని తెలిపారు. రాష్ట్రంలో 23లక్షల వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్ ను సరఫరా చేస్తున్నామన్నారు. ఏడాదిలో విద్యుత్ సమస్యలు తొలిగిస్తామంటే 50 ఏళ్లు అధికారంలో ఉన్న వారు తాము సాధించలేనిది కేసీఆర్ తో ఏం అవుతుందని అనుకున్నారని పేర్కొన్నారు.
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి రాష్ర్టాన్ని పాలించిన పార్టీలు తెలంగాణ ప్రాంత రైతుల అరిగోసను కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని విద్యుత్ మంత్రి మండిపడ్డారు. తెలంగాణకు ఓ పక్క గోదావరి - మరో పక్క కృష్ణానది సాగుతున్నదని, అయినప్పటికీ ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టాలనే ఆలోచనే ఆ పార్టీలు చేయలేదని మండిపడ్డారు. కమీషన్ల కోసం నీళ్లు లేని చోట ప్రాజెక్టులు కట్టడం - పారని చోట కాలువలు నిర్మించారని విరుచుకుపడ్డారు.