Begin typing your search above and press return to search.

ఎక్కువ మాట్లాడితే కోమటిరెడ్డి బ్రదర్స్ బట్టలు విప్పుతా

By:  Tupaki Desk   |   29 July 2021 7:58 AM GMT
ఎక్కువ మాట్లాడితే కోమటిరెడ్డి బ్రదర్స్ బట్టలు విప్పుతా
X
తెలంగాణ లో రాజకీయం హాట్ హాట్ గా సాగుతోంది. ఒక ఎన్నిక పూర్తి కాగానే మరో ఎన్నిక ఉండటం తో అన్ని పార్టీలు కూడా ఆరోపణలు , విమర్శలు , ప్రతి విమర్శలతో రాజకీయాన్ని వేడిపుట్టిస్తున్నాయి. తాజాగా కోమటి రెడ్డి బ్రదర్స్‌ పై మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా నదిలో నల్గొండ జిల్లా వాటా అమ్ముకుని డబ్బులు సంపాదించుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా రైతుల ఉసురు తీసింది వీళ్లేనని మంత్రి మండిపడ్డారు. ఎక్కువ మాట్లాడితే బట్టలు విప్పుతా ఖబద్దార్ అంటూ జగదీశ్ రెడ్డి హెచ్చరించారు.

వాళ్ల బాసులనే తరిమి, తరిమి కొట్టామని వీళ్లెంత అంటూ మంత్రి మండిపడ్డారు. వ్యక్తిగత జీవితాల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు.త్వరలో నియోజకవర్గంలోని రైతు వేదికల ప్రారంభోత్సవానికి స్వయంగా వస్తానని, అభివృద్ధికి అడ్డు తగిలే వారికి తగిన గుణపాఠం చెబుతామని కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఉద్దేశించి హెచ్చరించారు కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కేసు నమోదైంది. మంత్రి జగదీశ్ రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నందుకు గాను కోమటిరెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. తహసీల్దార్ గిరిధర్ ఫిర్యాదుతో చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు .

సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ లో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో గందరగోళం చోటు చేసుకొంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను పంపిణీని ప్రారంభించింది. అయితే మునుగోడు నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చౌటుప్పల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్బంగా తనకు సమాచారం ఇవ్వకుండా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టడాన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్పుబట్టారు.

చౌటుప్పల్‌లో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి,ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. జగదీశ్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో రాజగోపాల్ రెడ్డి మైక్ లాక్కోవడంతో... జగదీశ్ రెడ్డి,టీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ శ్రేణులు కూడా అంతే స్థాయిలో స్పందించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. దీంతో సభలో కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. ఈ నేపథ్యంలో మంత్రి జగదీశ్ రెడ్డి మునుగోడు పర్యటన సందర్భంగా 10వేల మంది దళితులతో నిరసన తెలియజేస్తామని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. దళిత బంధు పథకాన్ని మునుగోడులోనూ అమలుచేయాలని డిమాండ్ చేశారు. జగదీశ్ రెడ్డి పర్యటనను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకునే అవకాశం ఉండటంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.

అంతకుముందు చేత‌గాని మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి న‌ల్గొండ జిల్లాకు శ‌నిలా ప‌ట్టుకున్నాడ‌ని, డ‌బ్బు సంపాదించ‌డానికే ప‌రిమితం అయ్యాడ‌ని ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి తీవ్రంగా మండిప‌డ్డారు. ఆయ‌న అక్ర‌మాస్తుల‌ను వెలికి తీస్తామ‌ని హెచ్చ‌రించారు. అర్ధ‌రాత్రి నుండి కాంగ్రెస్ నాయ‌కుల‌ను అరెస్ట్ చేస్తున్నార‌ని, బేష‌ర‌తుగా వారంద‌రినీ విడిచిపెట్టాల‌ని డిమాండ్ చేశారు. పేదలకు అందుబాటులో ఉంటూ, తన సొంత డబ్బును ఖర్చు చేస్తూ ఆదుకుంటున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ని ప్రభుత్వ కార్యక్రమాలకు రాకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు. రాష్ట్రంలో టీఆర్ ఎస్ కు అమ్ముడుపోని ఎమ్మెల్యేలను ఈవిధంగా వేధించడం మంచి పద్ధతి కాదన్నారు. స్థానిక ఎంపీనైనా నన్ను కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవడం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.