Begin typing your search above and press return to search.

జ‌గ‌న్-ఒక జీవో.. మ‌రికొన్ని వివాదాలు-తేలేదేంటి..?

By:  Tupaki Desk   |   5 Jan 2023 6:39 AM GMT
జ‌గ‌న్-ఒక జీవో.. మ‌రికొన్ని వివాదాలు-తేలేదేంటి..?
X
ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వం తాజాగా తీసుకువ‌చ్చిన జీవో-1/2023 ద్వారా ఆయ‌న చెప్ప‌ద‌లుచుకున్న‌ది ఏం టి? ఆయ‌న ఉద్దేశం ఏంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న‌ది ఏంటి? ఇదీ.. ఇప్పుడు రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న ప్ర‌ధాన విష‌యం. ఎందుకంటే.. ఈ జీవో ద్వారా ప్ర‌తిప‌క్షాల గొంతు నొక్కే ప్ర‌య‌త్నం చేస్తున్నార ని, త‌న ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసేవారిని క‌ట్డడి చేస్తున్నార‌ని ఒక చ‌ర్చ సాగుతోంది.

మ‌రీ ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబును నిలువరించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌న్న‌ది ఆ పార్టీ నేత‌ల భావ‌న‌గా ఉంది.

విజ‌య‌న‌గ‌రం, బొబ్బిలి, నెల్లూరు జిల్లాల్లో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌కు ప్ర‌జ‌లు జోరుగా త‌ర‌లి వ‌స్తుండ‌డంతోనే ప్ర‌భుత్వం ప‌నిగ‌ట్టుకుని ఈ జీవో తీసుకువ‌చ్చింద‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నా రు. కేవ‌లం చంద్ర‌బాబును దృష్టిలో పెట్టుకుని.. ఈ జీవో తీసుకువ‌చ్చార‌ని కూడా ఆరోపిస్తున్నారు.

అయితే.. ప్ర‌భుత్వ వాద‌న వేరేగా ఉంది. గుంటూరు, కందుకూరు ఘ‌ట‌న‌ల్లో ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయార ని.. ఇలాంటివాటిని నిలువ‌రించేందుకు తాము జీవో తీసుకువ‌చ్చామ‌ని.. ప్ర‌భుత్వం చెబుతోంది.

దీనిలో త‌మ‌కు రెండో థాట్‌లేద‌ని కూడా చెబుతోంది. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌తిప‌క్షాలు వివాదం చేస్తున్నాయ‌నేది ప్ర‌భుత్వ వ‌ర్గాల వాద‌న‌. ఈ నేప‌థ్యంలో అస‌లు జీవో లో ఏముంది? అనేది ఆస‌క్తిగా మారింది.

జీవో-1/2023లో ఏముందంటే..
+ రోడ్డుపై ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న‌లు చేయ‌రాదు
+ నిర్ణీత సంఖ్య‌లో ప్ర‌జ‌ల‌ను పోగుచేయ‌రాదు
+ నిర్ణీత‌సంఖ్య‌లో ప్ర‌జ‌లు వ‌స్తార‌ని అనుకుంటే.. రోడ్ షోల‌ను నిర్వ‌హించరాదు
+ ప్ర‌జ‌ల ప్రాణాల‌కు ముప్పు క‌లిగిస్తుంద‌ని భావిస్తే.. ఎలాంటి షోల‌కు అనుమ‌తి ఉండ‌దు
+ రోడ్డు కూడ‌ళ్ల‌లో స‌భ‌లు, స‌మావేశాలు, నిర్వ‌హించ‌రాదు

+ స‌భ‌లు స‌మావేశాలు నిర్వహించేందుకు.. క్రీడా మైదానాలు, లేదా.. బ‌హిరంగ ప్ర‌దేశాల‌ను ఎంచుకోవ‌చ్చు.
+ దేనికైనా స‌రే..పోలీసుల‌కు సంబంధిత స‌మాచారాన్ని 24 గంట‌ల ముందుగా తెలియ‌జేయాలి
+ స‌భ‌, స‌మావేశాల‌కు సంబంధించికార్య‌నిర్వాహ‌కుల జాబితాను పోలీసుల‌కు ఇవ్వాలి.
+ ఏదైనా తొక్కిస‌లాట జ‌రిగినా.. ప్రాణాలు పోయినా.. సంబంధిత నిర్వాహ‌కులే బాధ్య‌త వ‌హించాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.