Begin typing your search above and press return to search.

టెన్త్ పై జగన్ మాట : గుజరాత్ కంటే ఏపీయే బెటర్

By:  Tupaki Desk   |   14 Jun 2022 11:31 AM GMT
టెన్త్ పై జగన్ మాట : గుజరాత్ కంటే ఏపీయే బెటర్
X
పదవ తరగతి పరీక్షా ఫలితాలు వచ్చి పది రోజులు అవుతున్నా రాజకీయ రగడ ఇంకా సాగుతూనే ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లా టూర్ లో ముఖ్యమంత్రి జగన్ తొలిసారిగా పదవతరగతి పరీక్షల ఫలితాల మీద తన గొంతు విప్పారు. ఏపీలో 67 శాతం ఉత్తీర్ణత నమోదు అయిందని అయితే రెండేళ్ల పాటు కరోనా వంటి పరిస్థితులు ఉండడం వల్ల కొంత ఇబ్బంది వచ్చి ఉండొచ్చని అన్నారు.

అయినా సరే నాణ్యతతో కూడిన విద్యను అందించాలన్న ఉద్దేశ్యంతోనే పట్టుదలగా పదవతరగతి పరీక్షలు నిర్వహించామని చెప్పారు. మన విద్యార్ధులు దేశంలోనే కాదు రేపటి రోజున ప్రపంచంలో కూడా గెలవాలన్న ఉద్దేశ్యంతోనే విద్యా రంగంలో సమూలమైన మార్పులు చేస్తూ వస్తున్నామని తెలిపారు.

విద్యార్ధులు ఉత్తమైన ప్రమాణాలతో విద్య అందుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యంగా చెప్పారు. ఇక 67 శాతం ఫలితాలు వచ్చాయని కేవలం నెల రోజుల వ్యవధిలోనే సంప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించి వారిని కూడా పాస్ చేయించి రెగ్యులర్ విద్యార్ధులతో పాటుగానే వారిని పరిగణించాలని కీలకమైన నిర్ణయం తీసుకున్నామని జగన్ చెప్పారు.

ఇక దేశంలో చూస్తే టెన్త్ ఫలితాలలో గుజరాత్ లో 65 శాతం మాత్రమే ఉత్తీర్ణత వచ్చిందని గుర్తు చేశారు. మరి దీన్ని ఏమంటారు అని ప్రశ్నించారు. దేశమంతా కరోనా ఉన్న వేళ ఫలితాలు అలా వస్తున్నాయని ఆయన అన్నారు. ఇలాంటి టైమ్ లో విద్యార్ధులలో మనో ధైర్యం కల్పించాలని, వారిని మళ్ళీ చదువు వైపుగా మళ్ళించాలని, కానీ ఏపీలో విపక్షాలు మాత్రం చిన్న పిల్లలతో కూడా రాజకీయాలు చేస్తున్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

టెన్త్ పరీక్షాలను కూడా తమకు అనుకూలంగా వాడుకోవడానికి చూస్తున్నాయని ఇది మంచి విధానం కాదని ఆయన అన్నారు. మొత్తానికి చూస్తే గుజరాత్ ఫలితాలు మనకంటే తక్కువ అని చెప్పడంలోని జగన్ ఉద్దేశ్యం ఏపీ చాలా బెటర్ అని.

అలాగే పోయిన వారిని కూడా నెల రోజుల్లో పాస్ చేసి ముందుకు తీసుకెళ్తూంటే మధ్యలో ఈ రాజకీయం ఏంటని కూడా చికాకు పడుతున్నారు. జగన్ టెన్త్ మీద చెప్పాల్సింది చెప్పేసారు. ఇపుడు గుజరాత్ కంటే ఏపీ బెటర్ అంటే విపక్షాలు ఏమంటాయో.