Begin typing your search above and press return to search.
బాబు ఆరాచకాలపై జగన్ సరికొత్త అస్త్రం
By: Tupaki Desk | 7 April 2017 4:50 AM GMTనిద్ర లేచింది మొదలు పడుకునే వరకూ విసుగూ.. విరామం లేకుండా నీతులు చెప్పేసే ప్రోగ్రామ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర కనిపిస్తుంటుంది. తానెంత తోపునన్న విషయాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా లక్షల సార్లు చెప్పుకునే చంద్రబాబు.. నీతికి.. నిజాయితీకి.. విలువలకు.. ఆదర్శాలకు కేరాఫ్ అడ్రస్ తానే అన్నట్లుగా మాటలు చెబుతుంటారు. చెప్పే మాటలకు.. చేసే పనులకు ఏమాత్రం సంబంధం ఉండదన్న విషయం బాబు తీరు గురించి తెలిసినవారందరికి తెలిసిందే.
ఆ మధ్యన తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చిన వెంటనే అగ్గిమీద గుగ్గిలం కావటమే కాదు.. ఆ విషయాన్ని ఏపీ అసెంబ్లీలో ప్రస్తావించి.. తన అక్రోశాన్ని ప్రదర్శించారు చంద్రబాబు. అంతేనా.. అలాంటి పనులు చేసిన కేసీఆర్ ను తనతో పాటు నిలదీయాలంటూ విపక్ష నేత జగన్ ను కోరారు కూడా. మరి.. అలాంటి పెద్ద మనిషి ఏ ముఖం పెట్టుకొని ఈ రోజున జగన్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారన్నది ప్రశ్న.
ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేల్ని చేరదీసి.. మంత్రిపదవి ఇస్తే విలువలకు తిలోదకాలు ఇచ్చినట్లుగా కిందామీదా పడే చంద్రబాబు.. అదే వెధవ పనిని ఏ మాత్రం జంకు లేకుండా చేసేయటం చూస్తే.. బాబులోని అవకాశవాదం ఎంత ఎక్కువన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. అధికారం చేతిలో ఉందన్న అహంభావంతో ఆరాచకంగా వ్యవహరించే చంద్రబాబు చేసే పనులు.. తీసుకునే నిర్ణయాల్ని అందరికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్న భావనకు వచ్చారు ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్.
నిత్యం ఆదర్శాలు వల్లించే చంద్రబాబులోని అసలు మనిషి ఎలా ఉంటారన్న విషయాన్నిఉదాహరణలతో సహా జాతీయ స్థాయి నేతలందరి దృష్టికి తీసుకెళ్లాలని జగన్ డిసైడ్ అయ్యారు. వివిధ పార్టీ నేతల్నికలిసి.. చంద్రబాబు చేసే అకృత్యాల్ని వివరించటంతోపాటు.. ఇలాంటివి చూసీచూడనట్లుగా వదిలేస్తే.. భవిష్యత్తులో ఇలాంటివి మీకు ఎదురయ్యే అవకాశం ఉందన్న విషయాన్ని జాతీయపార్టీ నేతలకు వివరించనున్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని జగన్ కోరనున్నారు.
ఇందులో భాగంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతల్ని కూడా కలుసుకోవాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓటుకు నోటు ఇస్తూ ఆడియో.. వీడియో టేపులతో సహా దొరికిపోయిన చంద్రబాబు.. విచ్చలవిడి అవినీతితో వెనకేసిన డబ్బుతో.. ఇతర పార్టీల ఎమ్మెల్యేల్నికొనుగోలు చేస్తున్న తీరును జాతీయ స్థాయిలో ప్రచారం చేసే దిశగా జగన్ ప్రయత్నాలు షురూ చేసినట్లుగా తెలుస్తోంది. తాజా పరిణామాలు ఏపీ ముఖ్యమంత్రికి ఇబ్బందికరంగా మారతాయనటంలో సందేహం లేదు. విలువలు.. ఆదర్శాల గురించి ప్రస్తావించే చంద్రబాబు అసలు రంగు తెలిసిన తర్వాత ఇతర పార్టీల దగ్గర టీడీపీ ఎంత పలుచన అవుతుందన్న విషయంపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/