Begin typing your search above and press return to search.

ఇసుక ఆరాచకానికి జగన్ ఆపరేషన్ షురూ

By:  Tupaki Desk   |   28 Aug 2019 5:20 AM GMT
ఇసుక ఆరాచకానికి జగన్ ఆపరేషన్ షురూ
X
కొన్ని సమస్యల్ని వెంటనే పరిష్కరించటం అంత తేలికైన విషయం కాదు. ఆ కోవలోకే వస్తుంది ఏపీలోని ఇసుక సమస్య. కాసులు కురిపించే ఇసుక వ్యాపారం మీద చాలామందికి కన్ను ఉంది. దీన్ని అడ్డుకోవటం.. ఇసుక మాఫియాను దారికి తీసుకొచ్చి.. ప్రజలకు అందుబాటు ధరల్లోకి ఇసుకను తీసుకురావటం అంత తేలికైన విషయం కాదు.

ఇసుక విషయంలోనే చంద్రబాబు ప్రభుత్వం ఎంత డ్యామేజ్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తన ప్రభుత్వంలో ఇసుక కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాజాగా ఈ అంశంపై ఫోకస్ చేశారు జగన్. ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టటమే కాదు.. గుత్తాధిపత్యాన్ని అడ్డుకునేందుకు వీలుగా ఆంక్షల్ని విధించింది జగన్ సర్కారు. అయితే.. తాము అనుకున్న దానికి భిన్నంగా ఇసుక థరలు భారీగా పెరిగిపోవటమే కాదు.. నిర్మాణదారులకు పెద్ద తలనొప్పిగా మారింది.

ఈ నేపథ్యంలో ఇసుక ఆరాచకాన్ని సెట్ చేసేందుకు సంబంధించి జగన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. వచ్చేనెల ఐదు నుంచి కొత్త ఇసుక పాలసీని అమల్లోకి తేనున్నట్లు చెప్పిన జగన్.. మార్కెట్ లో ఉన్న ధర కంటే తక్కువకే ఇసుకను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ఉన్నారు. ఇసుక సరఫరాను పెంచాలని చెప్పిన ఆయన.. అప్పుడు మాత్రమే ధర కంట్రోల్ కు వస్తుందన్నారు. ఇసుక సరఫరాను భారీగాపెంచటం ద్వారా డిమాండ్ ను తగ్గించటం.. ధర అదుపులోకి వచ్చేలా చేయటం.. గుర్తించిన స్టాక్ యార్డుల్లో ఇసుకను నింపాలని డిసైడ్ అయ్యారు. ఇసుక రవాణాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆయన భావిస్తున్నారు.

ఇసుక విషయంలో తప్పులు దొర్లకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్న జగన్.. రీచ్ ల విషయంలో ఎవరూ తప్పు చేయకుండా చూడాలని అధికారులకు విస్పష్ట ఆదేశాలు ఇచ్చారు. ఇసుక విషయంలో తమను డ్యామేజ్ చేసేందుకు ప్లాన్ చేస్తారని .. ప్రత్యర్థులకు ఆ అవకాశం ఇవ్వొద్దని చెప్పారు. ఇసుక ఇష్యూను సెట్ చేయటంతో పాటు.. ఆ అంశంలో సమస్య అన్నది లేకుండా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెప్పక తప్పదు.