Begin typing your search above and press return to search.

ఇసుక కొరత పై జగన్ యాక్షన్ ప్లాన్ ..!

By:  Tupaki Desk   |   12 Nov 2019 11:39 AM GMT
ఇసుక కొరత పై జగన్ యాక్షన్ ప్లాన్ ..!
X
రాష్ట్రంలో గత కొన్ని రోజులు గా ఉన్న ప్రధానమైన సమస్య ఇసుక. ఇసుక కొరత తీవ్రం గా ఉండటం తో ఎక్కడికక్కడ నిర్మాణాలు కూడా ఆగి పోయాయి. దీనితో కార్మికులు పనులు లేక కొంత మంది ఆకలి తో అలమటిస్తున్నారు ..మరి కొంతమంది ఆత్మ హత్యలకి పాల్పడుతున్నారు. దీనితో ప్రతి పక్షాలు కూడా ప్రభుత్వం పై స్వరం పెంచుతున్నాయి. ఎన్నడూ లేనంత గా ఇప్పుడే ఎందుకు ఇసుక కొరత ఏర్పడింది అంటూ విమర్శలు చేస్తున్నారు. వీటికి సమాధానం గా ఇసుక కొరత పై సీఎం జగన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసారు.

మంగళ వారం రోజు ఈ విషయమై అధికారుల తో సమీక్ష నిర్వహించి సీఎం .. నవంబర్‌ 14 నుంచి 21 వరకు రాష్ట్రంలో ఇసుక వారోత్సవాలు జరపాలని ఆదేశించారు. గతం లో సరాసరి ఇసుక డిమాండ్‌ 80వేల టన్నులు ఉండేది. వరదల తో రీచ్‌లు మునిగిన కారణంగా డిమాండ్‌ ను చేరుకో లేకపోయాం. గత వారం రోజులు గా పరిస్థితి మెరుగుపడింది అని తెలిపారు. రీచ్‌ల సంఖ్య సుమారు 60 నుంచి 90కి చేరింది. 137 నుంచి 180 వరకూ స్టాక్‌ పాయింట్లు పెంచాలి.

నియోజకవర్గాల వారీ గా రేటు కార్డును ప్రకటించాలి అని తెలిపారు. అలాగే ఎల్లుండి లోగా రేటు కార్డును నిర్ణయించాలి అని , ఇసుక ఎక్కువ ధర కు అమ్మితే రెండేళ్ల వరకు జైలు శిక్ష తప్పదు అని హెచ్చరించారు. ఇసుక కొరత తీరే వరకూ సిబ్బంది సెలవులు తీసుకోవ ద్దు అంటూ చెప్పారు. అలాగే సరిహద్దు ల్లోని అన్ని రూట్ల లో చెక్‌ పోస్టులు పెట్టాలి అని, 10 రోజుల్లోగా చెక్‌పో స్టులు, చెక్‌ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అని అధికారుల ను జగన్ ఆదేశించారు.