Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ పేషీలో ఎవ‌రెవ‌రు ఏమేమీ చేస్తుంటారంటే?

By:  Tupaki Desk   |   12 Jun 2019 5:15 AM GMT
జ‌గ‌న్ పేషీలో ఎవ‌రెవ‌రు ఏమేమీ చేస్తుంటారంటే?
X
క‌న్ఫ్యూజ‌న్ ను ఏ మాత్రం ద‌గ్గ‌ర‌కు రాకుండా పూర్తి క్లారిటీతో ప్ర‌భుత్వ ర‌థాన్ని న‌డిపిస్తున్నారు ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. తాజాగా త‌న సీఎంవోను పూర్తిస్థాయిగా సిద్ధం చేసేశారు. త‌న టీంను సిద్ధం చేసుకున్న ఆయ‌న‌.. ఏ అధికారి ఏమేం చేయాల‌న్న దానిపై తాజాగా క్లారిటీ ఇచ్చేశారు.

సీఎంవోలో అధికారుల‌కు శాఖ‌లు.. ప‌వ‌ర్స్ కేటాయించిన జ‌గ‌న్ ఎంపిక చూస్తే..

అజేయ క‌ల్లం (సీఎం ముఖ్య స‌ల‌హాదారు:

+ సాధార‌ణ ప‌రిపాల‌న‌

+ హోం.. ఆర్థిక‌ శాఖ‌లు

+ ప్ర‌ణాళిక‌

+ రెవెన్యూ

+ శాంతిభ‌ధ్ర‌త‌లు

+ ముఖ్య‌మంత్రి కార్యాల‌య కార్య‌క‌లాపాలు


పీవీ ర‌మేశ్ (సీఎం స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ)

+ వైద్య ఆరోగ్యం

+ కుటుంబ సంక్షేమం

+ విద్యాశాఖ (పాఠ‌శాల మొద‌లు సాంకేతిక విద్య వ‌ర‌కు)

+ ప‌రిశ్ర‌మ‌లు

+ వాణిజ్యం

+ మౌలిక వ‌స‌తులు

+ పెట్టుబ‌డులు

+ ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు

+ ఐటీ.. ఇన్ ఫ్రా

+ ఇంధ‌న శాఖ‌

సాల్మ‌న్ ఆరోగ్య రాజ్ (సీఎం కార్య‌ద‌ర్శి)

+ ట్రాన్స్ పోర్ట్.. ర‌హ‌దారులు.. భ‌వ‌నాల శాఖ‌

+ ఆర్టీసీ

+ గృహ‌నిర్మాణం

+ ఆహార‌.. పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌.. వినియోగ‌దారుల స‌మ‌స్యలు

+ పంచాయితీ రాజ్.. గ్రామీణాభివృద్ధి

+ సెర్ప్

+ అన్ని సంక్షేమ శాఖ‌లు

+ యువ‌జ‌న వ్య‌వ‌హారాలు.. క్రీడ‌లు

కె.ధ‌నుంజ‌య‌రెడ్డి (సీఎం అద‌న‌పు కార్య‌ద‌ర్శి)

+ నీటివ‌న‌రులు.. ప‌ర్యావ‌ర‌ణం

+ అట‌వీ.. సాంకేతిక‌.. మున్సిల్ ఆడ్మినిస్ట్రేష‌న్

+ అర్బ‌న్ డెవ‌ల‌ప్ మెంట్

+ సీఆర్డీఏ

+ వ్య‌వ‌సాయం.. హార్టిక‌ల్చ‌ర్.. సెరి క‌ల్చ‌ర్

+ ప‌ర్యాట‌కం

జె.ముర‌ళి (సీఎం అద‌న‌పు కార్య‌ద‌ర్శి)

+ ప‌శుసంవ‌ర్త‌క‌.. పాడి ప‌రిశ్ర‌మ‌.. మ‌త్య్స‌శాఖ‌

+ స‌హ‌కారం.. సంస్కృతి

డాక్ట‌ర్ ముక్తాపురం హ‌రికృష్ణ (సీఎం ప్ర‌త్యేక అధికారి)

+ ఆరోగ్య శ్రీ‌.. ముఖ్యమంత్రి స‌హాయ‌నిధి

+ ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ప్ర‌జ‌ల విజ్ఞ‌ప్తులు

పి.కృష్ణ‌మోహ‌న్ రెడ్డి (ఆఫీస‌ర్ ఆన్ స్పెష‌ల్ డ్యూటీ)

+ ముఖ్య‌మంత్రికి సంబంధించిన మినిట్ టు మినిట్ అపాయింట్ మెంట్స్

+ విజిట‌ర్స్ అపాయింట్ మెంట్స్