Begin typing your search above and press return to search.
జగన్ అడ్డాలో పంచాయతీ.. రాజీనామా చేశాడు!
By: Tupaki Desk | 6 Feb 2021 10:50 AM GMTకడప జిల్లాలో పంచాయతీ ఎన్నికలు అధికార వైసీపీలో చిచ్చు పెట్టాయి. సర్పంచ్ పదవి కూడా ఇవ్వలేదని జగన్ సన్నిహితుడు లోకేశ్వర్ రెడ్డి మనస్తాపం చెంది ఏకంగా జగన్ ఇచ్చిన ఐటీ సలహాదారు పదవికి రాజీనామా చేయడం సంచలనమైంది.
కడప జిల్లా చెన్నూరు మండలం ఉప్పరపల్లె గ్రామానికి చెందిన లోకేశ్వరరెడ్డి విద్యాధికుడు. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా చేశాడు. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు.
జగన్ కోసం ఎన్నికలకు ముందు ఉద్యోగాన్ని వదలుకొని కడప జిల్లాకు వచ్చారు. జగన్ కోసం పనిచేశారు. జగన్ సీఎం కాగానే లోకేశ్వరరెడ్డికి ప్రభుత్వ ఐటీ సలహాదారుగా పదవి ఇచ్చి కేబినెట్ హోదా కల్పించారు.
అయితే తన సొంత గ్రామం ఉప్పరపల్లె అభివృద్ధి కోసం లోకేశ్వరరెడ్డి ఎంతో కృషి చేశారు. ప్రభుత్వ నిధులు రాకున్నా.. దాదాపు 50 లక్షల సొంత డబ్బుతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు.
గత మార్చిలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో ఉప్పరపల్లె ఎంపీటీసీగా లోకేశ్వరరెడ్డి సోదరుడు త్రిలోక్ నాథరెడ్డి నామినేషన్ వేశారు. అదే స్థానానికి కమలాపురం ఎమ్మెల్యే
సర్పంచ్ పదవి కోసం సీఎం జగన్ సన్నిహితుడు, ఐటీ సలహాదారు తుమ్మళ్ల లోకేశ్వర్ రెడ్డి.., కమలాపురం ఎమ్మెల్యే రవీంధ్రనాథ్ రెడ్డి( జగన్ మేనమామ) వర్గీయులు పోటీపడ్డారు. వైసీపీ నుంచి ఇద్దరు పోటీపడడంతో అధిష్టానం పెద్దలు జోక్యం చేసుకొని ఎంపీటీసీ పదవి ఎమ్మెల్యే వర్గానికి.. సర్పంచ్ పదవి లోకేశ్వరరెడ్డి వర్గానికి ఇవ్వాలని రాజీ కుదిర్చారు. దీంతో నాడు నామినేషన్ ను లోకేశ్వరరెడ్డి వర్గం విత్ డ్రా చేసుకుంది.
ప్రస్తుతం పంచాయితీ ఎన్నికల వేళ లోకేశ్వరరెడ్డి తమ్ముడు త్రిలోక్ నాథ్ రెడ్డి సతీమణీ నామినేషన్ వేశారు. అయితే నాటి హామీని తుంగలో తొక్కి ఎమ్మెల్యే రవీంధ్రనాథ్ రెడ్డి తన అనుచరుడైన రాజేంద్రప్రసాద్ రెడ్డి భార్యతో నామినేషన్ వేయించారు.
రాజీ ఒప్పందాన్ని వైసీపీ నాయకులే చేసి.. ఇప్పుడు ఉల్లంఘించి పోటీకి దిగడంపై మనస్థాపం చెందిన లోకేశ్వర్ రెడ్డి ఏకంగా ప్రభుత్వ ఐటీ సలహాదారు పదవికి రాజీనామా చేయడం సంచలనమైంది. కేవలం సర్పంచ్ పదవి కోసం అంతపెద్ద సలహాదారు పదవినే లోకేశ్వరరెడ్డి కాదనడంపై వైసీపీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది.
జగన్ మేనమామ ఎమ్మెల్యే రవీంధ్రనాత్ రెడ్డి మోసం.. ఈ విషయంలో జగన్ ను ఏమీ అనలేకపోవడంతో అలిగిన లోకేశ్వరరెడ్డి ఇలా రాజీనామా చేశారు. ఈ విషయం సీఎం దృష్టికి కూడా వెళ్లినట్లు సమాచారం. అయితే అటు మేనమామ.. ఇటు దగ్గరి బంధువు కావడంతో సీఎం సర్దుబాటు చేయడానికి చూస్తున్నట్టు తెలిసింది.
కాగా లోకేశ్వరరెడ్డి గతంలో టీడీపీ ఐటీ గ్రిడ్ కుంభకోణం వెలుగులోకి తేవడంలో కీలక పాత్ర పోషించారు. ఎన్నికల సమయంలో ఎంతో సహకరించారు. అలాంటి సలహాదారు సర్పంచ్ పదవి కోసం రాజీనామా చేయడం సంచలనమైంది.