Begin typing your search above and press return to search.

రాము పై గురిపెట్టిన జగన్!

By:  Tupaki Desk   |   29 March 2022 4:37 AM GMT
రాము పై గురిపెట్టిన జగన్!
X
శ్రీ‌కాకుళం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం వ‌ర‌కూ ఇప్ప‌టిదాకా తిరుగులేని నేత‌గా యువ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు ఉన్నారు. ఇక‌పై కూడా ఉంటారు. అందులో సందేహ‌మే లేదు కానీ వైసీపీ మాత్రం బ‌ల‌మ‌యిన అభ్య‌ర్థిని నిలిపి ఈ స్థానాన్ని త‌న ఖాతాలో వేసుకోవాల‌ని అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తోంది. ముఖ్యంగా ఓ కాపునేత‌కు టికెట్ ఇవ్వాల‌ని యోచిస్తోంది. ఆ విధంగా రామూకు దీటుగా రాణించేందుకు మంత్రి బొత్స అనుచరుడు ఒక‌రు ఉవ్విళ్లూరుతున్నారు.

కాళింగ, వెల‌మ సామాజిక‌వ‌ర్గాలే వ‌రుసగా ఇక్క‌డి పార్ల‌మెంట్ స్థానాన్ని కైవ‌సం చేసుకుంటున్నాయి. కానీ ఈ సారి కాపు సామాజిక వ‌ర్గం సీన్ లోకి వ‌స్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచ‌న ఒక‌టి వెల్ల‌డ‌వుతోంది. వెలుగులోకి వ‌స్తోంది. మాజీ మంత్రి ధ‌ర్మాన కు కూడా బ‌ల‌మ‌యిన అభ్య‌ర్థి ఈయనే క‌నుక జ‌గ‌న్ మ‌దిలో ఈ ఆలోచ‌న క‌దులుతోంది.వెల‌మ సామాజిక వ‌ర్గ నేత‌గా రామూకు మంచి పేరు ఉంది.

ఆయ‌ను ఢీ కొనే శ‌క్తి జిల్లాలో మ‌రో నేత‌కు లేదు కూడా ! కానీ వైసీపీ కొత్త ఎత్తుగ‌డ‌ల్లో భాగంగా కాపు నేత పేరు తెర‌పైకి వ‌స్తే అప్పుడు అదే పార్టీలో ఉన్న కొంద‌రు నాయ‌కులు ఏమైపోతారో అన్న‌ది ఓ పెద్ద చ‌ర్చ.

గ‌త సారి ఎన్నిక‌ల్లో ఓడిపోయిన దువ్వాడ శ్రీ‌ను కు సొంత సామాజిక‌వ‌ర్గం నుంచే సాయం క‌రువు అయింది. కాళింగ సామాజిక‌వ‌ర్గం కు చెందిన శ్రీ‌నుకు మ‌ద్దతుగా ఎవ్వ‌రూ ప‌నిచేయ‌లేదు.

అంతేకాదు వైసీపీలో రాష్ట్ర స్థాయిలో పేరున్న నేత‌లంతా ఎర్ర‌న్న కుమారుడికే మ‌ద్ద‌తు ప‌లికారు. దువ్వాడ శ్రీ‌ను దురుసు ప్ర‌వ‌ర్త‌నే అందుకు కార‌ణం. సౌమ్య‌త‌తో న‌డుచుకునే రామూ అంటే జిల్లాలో ఉన్న వైసీపీ నేత‌ల‌కు కూడా ఎంతో ఇష్టం.

ఆ మాట‌కు వ‌స్తే విజ‌య‌న‌గ‌రం లీడ‌ర్ బొత్స కు కూడా ఇష్టం.ఒక‌వేళ అధినేత బొత్స సామాజిక‌వ‌ర్గంకు చెందిన నేత‌కే టికెట్ ఇస్తే క‌నుక అప్పుడు ఈక్వేష‌న్లు మారిపోవ‌డం ఖాయం. సీన్లోకి బొత్స రావొచ్చు. త‌న ఇంటి మ‌నిషిగా చెలామ‌ణీ అయ్యే వ్య‌క్తి క‌నుక ఆయ‌న గెలుపున‌కు ఆర్థికంగా మద్ద‌తు కూడా ఇవ్వొచ్చు అన్న‌ది నిర్వివాదాంశం.