Begin typing your search above and press return to search.
అవినీతిపై జగన్ అలెర్ట్.. ఈ ఆదేశాల మర్మమేంటి గురూ!!
By: Tupaki Desk | 14 Dec 2022 4:00 AM GMTఏపీ సీఎం జగన్ నోట అప్పట్లో అంటే.. 2019లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు తర్వాత.. మళ్లీ ఇన్నాళ్లకు 'అవినీతి' అనే మాట వినిపించింది. అదికూడాఅప్పట్లో ఉద్యోగులనుఉద్దేశించి ఆయన వ్యాఖ్యలుచేశారు. అవినీతికి పాల్పడవ ద్దంటూ.. ఉద్యోగులకు ఆయన హితవు పలికారు. ఇక, ఇప్పుడు ఏకంగా మంత్రులకు ఆయన హితోపదేశం చేశారు. మనం అవనీతికి పాల్పడితే.. అంటూ..తనను తాను కలుపుకొన్నా.. ఆయన ఉద్దేశం మాత్రం కేవలం ఐదుగురు మంత్రుల గురించే అనే టాక్ వినిపిస్తోంది.
అయితే, ఈ ఐదుగురి పేర్లను ఆయన ప్రకటించకపోయినా.. కలిపికొట్టరా కావేటి రంగా! అన్నట్టుగా అందరు మంత్రులను ఉద్దేశించి అవినీతి పాల్పడితే .. మీడియా వాచ్ ఉందని.. కాబట్టి బ్లేమ్ అయిపోతామని హెచ్చరించారు. ఈహెచ్చరిక తర్వాత.. సదరు ఐదుగురు మంత్రులు సైలెంట్‌గా వెళ్లిపోయారు. మిగిలిన వారు మాత్రం తమిడి చూసుకున్నారు. అరె.. మనం ఏం చేశామని.. సీఎం ఇలా అన్నారు? అని మీడియా ముందు ప్రశ్నించుకోవడం గమనార్హం. అంటే.. మొత్తంగా ఓ ఐదుగురు మంత్రులు అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నట్టు సీఎం జగన్ కూడా నిర్ధారించినట్టే తెలుస్తోంది.
ఇటీవల కాలంలో కర్నూలుకు చెందిన ఓ మంత్రిపై బాహాటంగానే అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నాయకుడు, మంత్రిపైనా ఇవే ఆరోపణలు ఉన్నాయి. మరో మంత్రి కోస్తా జిల్లాలకుచెందిన నేతపైనా.. ఇటీవల అంతర్గత చర్చల్లో అవినీతి కంపు గుభాళించి కొడుతోందని..
వైసీపీ నాయకులే అంటున్నారు. అలాగే.. సీమకు చెందిన మరో మంత్రి, సీఎం జగన్‌కు అత్యంత సన్నిహిత నేత కుటుంబం కూడా అవినీతికి దారులు వెతికిందనే వాదన వుంది. మొత్తంగా ఆ ఐదుగురు మంత్రులు పెద్ద నాయకులుకావడం.. బీసీ వర్గాల్లో మంచి పలుకుబడి ఉండడంతో వారిని ఏమీ అనలేక ఇలా అందరికీ కలిపి క్లాస్ పీకారనే చర్చ సాగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.