Begin typing your search above and press return to search.
జగన్ అమెరికాకు ఎందుకు వెళుతున్నారు?
By: Tupaki Desk | 24 July 2019 5:01 AM GMTఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో అమెరికాకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి బిజీబిజీగా ఉంటున్న ఆయన.. కుటుంబ సభ్యులతో అస్సలు గడపని పరిస్థితి నెలకొంది. తీరిక లేని షెడ్యూల్స్ నేపథ్యంలో.. దాని నుంచి బయటపడేందుకు వీలుగా ఆయన యూఎస్ ట్రిప్ ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు.
కుటుంబ సభ్యులతో కలిసి ఆగస్టు 17న అమెరికాకు వెళ్లనున్నారు జగన్. దాదాపు వారం పాటు ఆయన యూఎస్ ట్రిప్ సాగనుంది. సీఎం బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్ చేస్తున్న తొలి విదేశీ పర్యటనగా దీన్ని చెప్పాలి. తన అమెరికా పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
కుటుంబ సభ్యులతో కలిసి వెళుతున్నప్పటికీ.. అమెరికాలోని నార్త్ అమెరికా తెలుగు కమ్యూనిటీ సభలోనూ.. డల్లాస్ లోని ప్రవాస భారతీయులు నిర్వహించే సభలోనే జగన్ పాల్గొననున్నారు. ఆయన ఆగస్టు 23న అమెరికాలో రిటర్న్ అవుతారు. ఆగస్టు 24 నాటికి ఏపీకి చేరుకుంటారని చెబుతున్నారు. తాజా యూఎస్ ట్రిఫ్ ఫ్యామిలీ కమ్ ప్రొఫెషన్ ట్రిప్ గా చెప్పాలి.