Begin typing your search above and press return to search.

బాబు క‌న్నా ముందే జ‌నంలోకి జ‌గ‌న్ !

By:  Tupaki Desk   |   26 May 2022 10:30 AM GMT
బాబు క‌న్నా ముందే జ‌నంలోకి జ‌గ‌న్ !
X
పాలితులుగా ఉన్న‌వారు పాల‌కులుగా మారారో వారికి వీటిని వివ‌రించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంది..అందుకే బ‌స్సు యాత్ర చేప‌డుతున్నాం. ఈ మార్పును ప్ర‌జ‌ల దృష్టికి తీసుకువెళ్లేందుకు బ‌స్సు యాత్ర చేప‌డుతున్నాం. వృత్తి కులాల‌కు చెందిన వారికి ఆద‌రువుగా నిలిచిన ప్ర‌భుత్వం ఇది.

ఇదంతా మార్పు.. నిధుల‌లో దుర్వినియోగం లేదు. అందుకే విప‌క్ష నాయ‌కులు అవినీతి ఆరోప‌ణ‌లు చేయ‌లేక‌పోతున్నారు.."అని అన్నారు మంత్రులు. ఇవాళ బ‌స్సు యాత్ర ప్రారంభం సంద‌ర్భంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి చేరుకున్న మంత్రులు మీడియా మీట్ నిర్వ‌హించి 4 ముఖ్య విష‌యాలు చెప్పారు. చాలాకాలానికి హుందాగా మాట్లాడే ప్ర‌య‌త్నం ఒక‌టి చేశారు.

వాస్త‌వానికి విప‌క్షం కూడా కోరుతున్న‌ది ఇదే ! ఏమ‌యినా మాట్లాడండి కానీ హుందాత‌నం మిస్ కావొద్దు అనే! ఆ విధంగా ఇప్పుడు శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల్లో భాగంగా తామేం చేశామో, ఏం చెప్పామో .. అన్న‌వి వివ‌రించ‌నున్నారు బీసీ మంత్రులు. వీరితో పాటే మైనార్టీ మంత్రులు.

ఇదిలా ఉంటే జ‌గ‌న్ ఆలోచ‌న మేర‌కు జ‌నంలోకి వెళ్లారు మంత్రులు. ఓ విధంగా టీడీపీ క‌న్నా ముందే జ‌నంలోకి వెళ్లారు మంత్రులు. రేప‌టి నుంచి వాళ్లు మ‌హానాడు పేరిట చెప్పే మాట‌ల‌కు ఇప్ప‌టి నుంచే కౌంట‌ర్ ఇస్తున్నారు. నాల్గు రోజుల పాటు ఈ వేగం వాదం సాగ‌నుంది. ఓ విధంగా బాబు మాట‌ల‌కు జ‌గ‌న్ ఇచ్చే కౌంట‌ర్లు అన్నీ మంత్రుల నోట నుంచి రానున్నాయి. ప‌ల‌క‌నున్నాయి.. వినిపించ‌నున్నాయి. న‌యా పంచాయితీకి కార‌ణం కానున్నాయి.

ఇంకా మంత్రులు ఏమ‌న్నారంటే..

వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు సంబంధించి పాల‌న‌లో సమున్న‌త అవ‌కాశం అన్న‌ది జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వంలోనే సాధ్యం అయింది. 74 శాతం ఎస్సీ ఎస్టీ బీసీ వ‌ర్గాల‌కు అవ‌కాశం ఇచ్చి సంబంధిత వ‌ర్గాల‌కు మ‌నోవాంఛ‌ను నెర‌వేర్చారు. రాజ‌కీయ అధికారం లేకుండా సామాజిక న్యాయం సాధ్యం కాదు. రాజ‌కీయ అధికారంతోనే విద్య‌తో పాటు ఇత‌ర అవ‌కాశాలు అందించిన‌ప్పుడే సామాజిక న్యాయం ద‌క్కించ‌డం సాధ్యం అవుతుంద‌ని జ‌గ‌న్ భావించారు.

ఈ క్ర‌మంలో ఎవ్వ‌రూ అడ‌గ‌కుండానే త‌నంత‌ట తాను విశాల భావ‌జాలం ఇముడ్చుకుని సంబంధిత నిర్ణ‌యాల‌ను వెనువెంట‌నే అమ‌లు చేశారు. ఈ రాష్ట్రంలో సంపూర్ణ‌మ‌యిన ఆర్థిక వ‌నరుల‌లో అగ్ర‌భాగం నేరుగా బీసీల‌కే అందుతోంది. 82 శాతం వెళ్తుంది. పంచిపెట్ట‌డం అన్న‌ది ఓ హేళ‌న‌గా మాట్లాడుతోంది విప‌క్షం. రాజ్యాంగానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఎప్పుడు పాల‌న జ‌రిగిందో చెప్పాలి ? అన్న‌ది మా డిమాండ్ అని చెప్పారు.