Begin typing your search above and press return to search.
చంద్రబాబు - జగన్.. ఇద్దరూ విదేశాలకే!
By: Tupaki Desk | 26 July 2019 4:58 PM GMTఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడి రాజకీయం వేడివేడిగా ఉన్న వేళ ముఖ్యమంత్రి - ప్రతిపక్ష నేత ఇద్దరూ విదేశీ పర్యటనలకు వెళ్తుండడంతో తాత్కాలికంగా రాజకీయ వేడి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేత - టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఈ ఆదివారం అమెరికా వెళ్లనున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్తారు. అందుకోసం ఆయన ఇప్పటికే ఈ రోజు హైదరాబాద్ చేరుకున్నారు. ఆదివారం అమెరికా వెళ్లి మళ్లీ ఆగస్టు 1 అంటే గురువారం రాష్ట్రానికి వచ్చేస్తారు. చంద్రబాబు వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు సీఎం జగన్ మోహనరెడ్డి కూడా విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన పర్యటన.. చంద్రబాబు రాష్ట్రానికి తిరిగొచ్చేశాక మొదలుకానుంది. ఆగస్టు 1 నుంచి 4వ తేదీ వరకు ఆయన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆయనకు ఇదే తొలి విదేశీ పర్యటన.
ఆగస్టు 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జెరుసలేంలో పర్యటించి రాష్ట్రానికి తిరిగిరానున్నారు. జగన్ వెంట వ్యక్తిగత సిబ్బందితో పాటు ఎస్ ఎస్ జీ ఎస్పీ సెంథిల్ కుమార్ - సీఎం వ్యక్తిగత భద్రతా అధికారి జోషి వెళ్లనున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సీఎం. వైఎస్. జగన్ మోహన్ రెడ్డి జెరూసలేం పర్యటన చేస్తున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ లోని క్రైస్తవ పవిత్ర స్థలాలతో పాటు క్రీస్తు జన్మస్థలం బెత్లహాంను సైతం సీఎం జగన్ సందర్శిస్తారు. మొత్తానికి జులై 28 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు చంద్రబాబు.. 1 నుంచి 4 వరకు జగన్ రాష్ట్రంలో ఉండకపోవడంతో రాజకీయ వేడి కాస్త తగ్గుతుందని విశ్లేషకులు అంటున్నారు.