Begin typing your search above and press return to search.

తెలంగాణలో రేవంత్‌... ఏపీలో జగన్‌

By:  Tupaki Desk   |   17 March 2015 7:51 AM GMT
తెలంగాణలో రేవంత్‌... ఏపీలో జగన్‌
X
విభజన తరువాత రెండు రాష్ట్రాల శాసనసభలు ఒకేసారి, ఒకే చోట జరగడం ఇదే ప్రథమం.... దీంతో ఈ సభలకు విపరీతమైన ప్రాధాన్యం ఏర్పడింది. రెండు సభల్లోనూ ఈసారి ఓ పోలిక కనిపించింది. ప్రత్యేకంగా ఒక నేతను లక్ష్యంగా చేసుకుని అధికార పక్షాలు ఆ నేతను మాట్లాడనివ్వకుండా అడ్డుకుంటున్నాయి. తెలంగాణ శాసనసభలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి చెందిన రేవంత్‌ రెడ్డికి ఈ పరిస్థితి రాగా ఏపీలో వైసీపీ అధినేత జగన్‌కు ఇదే పరిస్థితి ఎదురవుతోంది.

విచిత్రంగా తెలంగాణలో ప్రతిపక్షంగా ఉంటూ ఇబ్బంది పడుతున్న టీడీపీ ఏపీ విషయానికి వచ్చేసరికి అధికారంలో ఉంటూ ప్రతిపక్ష వైసీపీని చెడుగుడు ఆడుకుంటోంది. జగన్‌ మైకు పట్టుకుంటే చాలు మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా ఒక్కపెట్టున గందరగోళం సృష్టిస్తున్నారు. అంతేకాదు, స్వయంగా సీఎం చంద్రబాబు లేచి నిలబడుతుండడంతో మాట్లాడే అవకాశం కాస్తా ఆయనకు మళ్లిపోతోంది. ఈ ఎత్తుగడ కారణంగా మంగళవారం మూడుసార్లు జగన్‌కు మైకు దొరికినట్లే దొరికి చంద్రబాబుకు వెళ్లిపోయింది.

మొత్తానికి తెలంగాణలో రేవంత్‌రెడ్డికి... ఏపీలో జగన్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వరాదన్నదే అధికారపక్షాల లక్ష్యంగా కనిపిస్తోంది.