Begin typing your search above and press return to search.

ఇయర్ ఎండింగ్ లో అటు జగన్ ఇటు బాబు అక్కడే ఫోకస్

By:  Tupaki Desk   |   24 Dec 2022 8:30 AM GMT
ఇయర్ ఎండింగ్ లో అటు జగన్ ఇటు బాబు అక్కడే ఫోకస్
X
కొద్ది రోజులు గడిస్తే చాలు 2022 చరిత్రలో కలసిపోతుంది. కొత్త ఏడాదితో సరికొత్తగా క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది. ఇదిలా ఉంటే 2022లో కరోనా బాగా తగ్గి భారీ ఊరట ఇవ్వడంతో ఏపీ రాజకీయం అంతా జనాల చెంతకు చేరింది. ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కే కార్యక్రమాన్ని తన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి జిల్లాల దాకా తీసుకువచ్చారు. భారీ సభలు పెట్టి జనం మధ్యలో బటన్ నొక్కి ఇదిగో మీ నగదు అంటూ ఖాతాలలోకి నేరుగానే వేస్తున్నారు.

ఈ సందర్ఘంగానే జగన్ తాను ప్రభుత్వం చేసే మంచిని చెప్పాలనుకుంటునంది విపక్షాలను విమర్శించాలనుకుంటున్నదీ కూడా అన్ని చెబుతున్నారు. ఒక విధంగా జగన్ ప్రభుత్వ సభలలోనే తన పార్టీ గురించి నాలుగు మంచి మాటలు చెప్పుకుంటున్నారు. ఎన్నికల ప్రచారాన్ని కూడా అలా చేసుకుంటూ వస్తున్నారు. మరి చంద్రబాబు ఊరుకుంటారా. ఆయన కూడా జిల్లాల టూర్లు చేస్తున్నారు. అన్ని చోట్లా ఆయన హడావుడిగా తిరుగుతున్నారు.

ఏపీ సర్కార్ బడాయి కబుర్లు అంటూ జనంలోనే వైసీపీ గుట్టు బయటపెడుతున్నారు. 2022లో బాదుడే బాదుడు అంటూ స్టార్ట్ చేసి అన్ని జిల్లాలు తిరిగిన బాబు ఏడాది చివరకు వచ్చేసరికి ఇదేమి ఖర్మ అంటూ మరో కార్యక్రమాన్ని ఎత్తుకున్నారు. దాంతో జిల్లాల పర్యటనలు చేస్తూ వస్తున్నారు. ఇక బాబు ఏపీలో ఉన్న రాయలసీమ కోస్తా గోదావరి జిల్లాలలో టూర్లతో పాటు ఇయర్ ఎండింగ్ లో ఉత్తరాంధ్రాను ఎంచుకున్నారు.

మూడు రోజుల విజయనగరం జిల్లా టూర్ ను బాబు పెట్టుకుని జగన్ సర్కార్ మీద హాట్ హాట్ కమెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఏపీలో సైకో పాలన అంతం కావాలని సైకిల్ పాలన తిరిగి రావాలని ఆయన ప్రజలకు పిలుపు ఇస్తున్నారు. వచ్చేది మన ప్రభుత్వమే అంటున్నారు. ఉత్తరాంధ్రా టీడీపీకి కంచుకోట. కాబట్టి ఇక్కడ నుంచే గేర్ మార్చి స్పీడ్ పెంచాలని బాబు చూస్తున్నారు.

ఇక జగన్ కూడా విశాఖ శ్రీకాకుళం జిల్లాలకు ఈ ఏడాదితో అనేక సార్లు వచ్చారు. అనేక కార్యక్రమాలలో పాలు పంచుకున్నారు. ఈ ఏడాది ఎండింగ్ లో ఫైనల్ టచ్ ని ఆయన ఉత్తరాంధ్రాలో ఇస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా నర్శీపట్నంలో ఎనిమిది వందల కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను జగన్ ఈ నెల 28న తన జిల్లా టూర్ లో శ్రీకారం చుడుతున్నారు.

అలాగే నర్శీపట్నంలో ఆ రోజున మెడికల్ కాలేజీకి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. సాగునీటి ప్రాజెక్టులకు కూడా శ్రీకారం చుట్టనున్నారు. మొత్తానికి అటు జగన్ కానీ ఇటు బాబు కానీ 2022 చివరల్లో లాస్ట్ పంచ్ అన్నట్లుగా ఉత్తరాంధ్రాకే అధిక ప్రయారిటీ ఇవ్వడం విశేషం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.