Begin typing your search above and press return to search.
మహానేత వైఎస్ కు కుటుంబం ఘన నివాళి!
By: Tupaki Desk | 8 July 2017 10:29 AM GMTమహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 68వ జయంతి వేడుకలు శనివారం రెండు తెలుగు రాష్ట్రాలలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మహానేత వైఎస్ ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ ఆర్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. వైఎస్ ఆర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ - ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - ఆయన సతీమణి వైఎస్ భారతి - కుమార్తె వైఎస్ షర్మిల - అల్లుడు బ్రదర్ అనీల్ - ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి - ఎంపీ మిథున్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు వైఎస్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడకు భారీ ఎత్తున అభిమానులు - కార్యకర్తలు వచ్చారు. వారందరినీ జగన్ ఆప్యాయంగా పలకరించారు. వైయస్ ఆర్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని , ఆయన పేదవాడికి ఎప్పుడూ అండగా నిలిచారని జగన్ అన్నారు.
తర్వాత వైఎస్‌ఆర్ ఘాట్ ప్రాంగణంలోని మహానేత విగ్రహానికి వైఎస్ జగన్ పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు వైఎస్ఆర్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మరోవైపు మహానేత 68వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ అభిమానులు భారీ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
వైఎస్ ఆర్ జయంతి సందర్భంగా తండ్రితో ఉన్న జ్ఞాపకాలను వైఎస్ జగన్ ట్విట్టర్ లో పంచుకున్నారు.‘నేనేప్పడు ప్రజలను కలుసుకున్నా వారందిరిలోనూ నాన్నగారినే చూస్తున్నాను. వారి ఆదరాభిమానాలు, ఆప్యాయతల్లో నిత్యం ఆయనే కనిపిస్తున్నారు. ప్రజలు చూపిన మార్గంలో నేను నాన్న లాగానే నడుస్తాను. ఆయన కుమారుడిగా గర్వపడుతున్నాను.’ అని ఆయన ట్విట్ చేశారు.