Begin typing your search above and press return to search.
కేసీఆర్ ఆడ్వాన్స్ వెర్షన్ అతగాడేనంట
By: Tupaki Desk | 18 Oct 2015 5:30 PM GMTఎప్పుడు వంగాలో.. ఎక్కడ తన రేంజ్ చూపించాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదని చెబుతుంటారు. ఆయన తీరు అర్థం కాక కొమ్ములు తిరిగిన రాజకీయ నేతలు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. నిజానికి ఏ విధంగా చూసినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు.. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ కు పోలిక పెట్టలేని పరిస్థితి.
తాను చేయాలనుకున్న ఏ పనిని అయినా వ్యూహాత్మకంగా చేయటం కేసీఆర్ కు అలవాటు. అదే జగన్ వ్యవహారం దీనికి భిన్నంగా ఉంటుంది. కేసీఆర్ వ్యూహాలు చాలా లోతుగా ఉంటాయి. కానీ.. జగన్ వ్యూహం చాలా పేలవంగా ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకుంటే అదెంత వరకూ వెళుతుంది? దాని ప్రభావం ఎంత? అన్న అంశాల మీద కేసీఆర్ అనుభవం స్పష్టంగా కనిపిస్తే.. జగన్ లో ఇదే విషయాన్ని అనుభలేమి స్పష్టంగా కనిపిస్తుంది.
దశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఉండటం.. డక్కామొక్కీలు తిన్న కేసీఆర్ కు ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ చెలరేగిపోవాలో బాగా తెలుసు. అయితే.. తన ఎంట్రీతోనే రాజకీయాల్లో కలకలం సృష్టించిన జగన్ కు తగిలిన ఎదురుదెబ్బలు తక్కువనే చెప్పాలి.
ఇన్ని వైరుద్యాలు ఉన్న ఇద్దరిలో కామన్ పాయింట్లు చాలానే కనిపిస్తాయి. ప్రత్యర్థుల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకపోవటం.. మొండితనం.. ఈగో.. అహంభావం.. ప్రతీకారేచ్ఛతో రగిలిపోవటం లాంటివి ఇద్దరిలోనూ కనిపిస్తాయి. కాకుంటే.. కేసీఆర్ లో ఇలాంటివన్న మెచ్యూర్డ్ గా కనిపిస్తే.. జగన్ లో మాత్రం పిల్లతరహాలో ఉంటాయన్న విమర్శ ఉంది.
తాజాగా అమరావతి శంకుస్థాన కార్యక్రమానికి సంబంధించిన వ్యవహారమే చూస్తే.. తాను శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కానని.. తనకు ఆహ్వానం కూడా పంపొద్దంటూ చెప్పేశాడు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే.. మరోవైపు చంద్రబాబుకు మరో రాజకీయ ప్రత్యర్థి అయిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం శంకుస్థాపనకు వచ్చే అంశానికి సంబంధించి సానుకూలంగా స్పందించారు.
నిజానికి ఇద్దరూ చంద్రబాబుకు రాజకీయ ప్రత్యర్థులే. కానీ.. ఏ విషయంలో ఎలా వ్యవహరించాలో కేసీఆర్ కు తెలిసినట్లుగా జగన్ కు తెలీకపోవటమే అసలు సమస్య. తనను కలిసేందుకు వచ్చిన విపక్ష నేతల్ని గంటల కొద్ది సమయం వెయిట్ చేయించి.. ఆపై వారిని కలవటం కుదరదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ షాకిస్తే.. తనకు శంకుస్థాపన ఇన్విటేషన్ ను ఇచ్చేందుకు వస్తానన్న మంత్రులకు జగన్ చుక్కలు చూపించారు. తన ఫోన్ ను ఎత్తని ఆయన.. జగన్ పీఏకు ఫోన్ చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరకు కిందామీదా పడి జగన్ తో ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేస్తే.. ఆయన మాట్లాడకుండా తనకు సన్నిహితుడైన వైవీ సుబ్బారెడ్డికి ఫోన్ ఇచ్చేసిన వైనం తెలిసిందే.
అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా కేసీఆర్..తన విపక్ష నేతల్ని కలవకుండా వారికి చేదు అనుభవాన్ని మిగిలిస్తే.. పవర్ లేని జగన్.. పవరున్న మంత్రులకు షాకిచ్చారు. కాకుంటే.. కేసీఆర్ చర్యను విమర్శించే వారి కంటే సమర్థించే వారు ఎక్కువగా ఉంటే.. జగన్ విషయంలో మాత్రం విమర్శించే వారే ఎక్కువ. ప్రజలు దేనినైనా భరిస్తారు కానీ అహంకారాన్ని భరించలేరని.. ఆ విషయాన్ని జగన్ గుర్తించనట్లు ఉన్నారని ఒక మంత్రి లోగుట్టుగా వ్యాఖ్యానించారు.
ఇక.. జర్నలిస్ట్ సర్కిల్స్ తో శంకుస్థాపన ఎపిసోడ్ తర్వాత జగన్ గురించి ఒక జర్నలిస్ట్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటివరకూ కేసీఆర్ ను మాత్రమే చూశాం. చూస్తుంటే.. జగన్ ఆయన అడ్వాన్స్ వెర్షన్ మాదిరి ఉన్నారు. విపక్ష నేతగానే ఇలా వ్యవహరిస్తున్న జగన్.. రేపొద్దున ఏపీ ముఖ్యమంత్రి అయితే ఆయన రాజకీయ ప్రత్యర్థుల పరిస్థితి ఎలా ఉంటుందో?’’ అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. అమరావతి శంకుస్థాపన ఎపిసోడ్ పుణ్యమా అని.. జగన్ కు భిన్నమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారన్న మాట వినిపిస్తోంది.