Begin typing your search above and press return to search.
ఆరుగంటల భేటీ మధ్యలో కేసీఆర్..జగన్ లు ఫోన్లు చేసిందెవరికి?
By: Tupaki Desk | 14 Jan 2020 6:15 AM GMTరెండు తెలుగు రాస్ట్రాల ముఖ్యమంత్రుల ఏకాంత భేటీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుకోవాలనుకున్నప్పుడు.. ఎజెండాకు తగ్గట్లుగా ఆయా శాఖలకు సంబంధించిన సీనియర్ అధికారుల్ని వెంట పెట్టుకెళ్లటం చేస్తుంటారు. అందుకు భిన్నంగా నేతలు కానీ కీలకమైన అధికారులు కానీ లేకుండా వన్ టు వన్ ఇరువురు సీఎంలు ఆరు గంటల పాటు ప్రైవేటుగా మాట్లాడుకోవటం చాలా తక్కువ సందర్భాల్లోనే జరుగుతుందని చెప్పాలి.
అలాంటి సీన్ తాజాగా చోటు చేసుకుంది. ముఖ్యమంత్రులు కేసీఆర్.. జగన్ లు ఇరువురు భేటీ అయిన సందర్భంగా ఎవరూ అంచనా వేయలేని పరిణామం ఒకటి చోటు చేసుకున్న వైనం బయటకు వచ్చింది. ఇరువురు ముఖ్యమంత్రులు తమ సీఎస్ లకు ఎవరికి వారు ఫోన్లు చేయటం గమనార్హం. ఒకే రూంలో ఉండి ఇరువురు తమ సీఎస్ లతో స్వయంగా మాట్లాడి.. ముందు రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్య అధికారులు భేటీ కావాలని ఆదేశించటం గమనార్హం.
అంతేనా.. తొలుత తెలంగాణ నుంచి సీఎస్ తో పాటు టీం ఒకటి ఏపీకి వెళ్లాలని.. ఆ తర్వాత ఏపీ టీం తెలంగాణకు వచ్చి అధికారులతో భేటీ అయి విషయాల్ని చర్చించాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఈ రెండు టీంల మధ్య సాగే భేటీల్లో విభజన చట్టంలోని 9 - 10 షెడ్యూళ్లలోని అంశాల్ని పరిష్కరించుకునే దిశగా అడుగులు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఇరువురు ముఖ్యమంత్రులు ప్రైవేటుగా సమావేశమైన రూంలో ఒకే ఫోన్ ఉందా? రెండు ఫోన్లు ఉన్నాయంటారా?