Begin typing your search above and press return to search.
జూనియర్ తమ్మినేనికి జగన్ గిఫ్ట్...?
By: Tupaki Desk | 7 Aug 2022 1:30 AM GMTజగన్ తరచూ ఎక్కువగా ఏపీలోని పలు ప్రాంతాలకు వస్తున్నారు. అయితే ఆయన టూర్లు అన్నీ కూడా పూర్తిగా ప్రైవేట్ పరం అయినవే. ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్ళల్లో పెళ్ళిళ్ళకు ఎక్కువగా జగన్ వస్తున్నారు. ఇక అదే తీరున అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు చిరంజీవి నాగ్ వివాహానికి జగన్ వచ్చారు. వధూవరులను ఆశీర్వదించారు. సీఎం గా తమ్మినేని తనయుడు వివాహానికి రావడమే పెద్ద గిఫ్ట్.
అయితే స్పీకర్ తమ్మినేని కానీ ఆయన కుమారుడు కానీ ఆశించే గిఫ్ట్ వేరుగా ఉంది అంటున్నారు. అదేంటి అంటే వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి ఆముదాలవలస టికెట్ ని ఇవ్వాలని స్పీకర్ ఇప్పటికే జగన్ దృష్టిలో తన విన్నపాన్ని పెట్టారు. అంతే కాదు ఆ మధ్యన ఆయన అసెంబ్లీ సమావేశాల వేళ తన కుమారుడిని వెంటబెట్టుకుని మరీ జగన్ని ప్రత్యేకంగా కలిసారు. జగన్ కూడా బాగా పనిచేసుకో అని జూనియర్ తమ్మినేనికి సూచించారు.
దాంతో రెట్టించిన ఉత్సాహంతో చిరంజీవి నాగ్ పనిచేస్తున్నారు కానీ ఆముదాలవలస టీడీపీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న సీటు. పైగా అక్కడ టీడీపీ తరఫున ప్రత్యర్ధిగా ఉన్నది తమ్మినేని సీతారాం మేనల్లుడు కూన రవికుమార్. రవికుమార్ తనదైన రెబలిజం తో దూకుడుతో జనాల్లో దూసుకుపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన్ని ఓడించడం అంటే కష్టమే అంటున్నారు.
పైగా తమ్మినేని ఫ్యామిలీకి సొంత పార్టీలోనే వ్యతిరేక వర్గం తయారైంది. ఆముదాలవలస వైసీపీలో వర్గపోరు తీర్చలేనిదిగా ఉందిట. ఈ నేపధ్యంలో మళ్ళీ తమ్మినేని కుటుంబానికే టికెట్ ఇస్తే ఓటమి తప్పదని పార్టీలో ప్రత్యర్ధుల నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. అయితే జగన్ దే ఫైనల్ డెసిషన్ కాబట్టి ఆయన తలచుకుంటే పెద్దాయన కోరికను మన్నించి జూనియర్ తమ్మినేనికి టికెట్ ఇవ్వవచ్చు. మరి గెలిచే వారికే టికెట్లు కాబట్టి ఇప్పటి నుంచి బాగా పనిచేసి జనంలో పేరు తెచ్చుకుంటేనే అది సాధ్యపడుతుంది.
మొత్తానికి తన వివాహానికి వచ్చి దీవించిన జగన్ అదే చేత్తో వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ఇస్తారని జూనియర్ తమ్మినేని బాగానే ఆశిస్తున్నారు. జగన్ ఇచ్చే అసలైన గిఫ్ట్ కోసం ఆయన ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఎక్కడైనా బావ కానీ వంగతోటలో కాదన్న సూత్రాన్ని జగన్ వంటబట్టించుకున్నారు. ఆయన చిరునవ్వులు చిందిస్తారు కానీ టికెట్ అంటే అన్ని లెక్కలు పక్కాగా కుదిరితేనే అంటారు. మరి తమ్మినేని వారి ఇలాకాలో పెళ్ళి అయింది, ఆ ఇంట్లో ఒక శుభం జరిగింది. మరి ఆముదాలవలస కూడా తమ్మినేని ఫ్యామిలీని దీవిస్తుందా. జగన్ ఆశీస్సులు నిండుగా ఉంటాయా అంటే వెయిట్ అండ్ సీ అనే జవాబు వస్తోంది.