Begin typing your search above and press return to search.
ఓటింగ్ కి దూరమైనా 18 మంది ఎమ్మెల్యేలు ... ఆ సమయంలో ఏంచేస్తున్నారంటే !
By: Tupaki Desk | 28 Jan 2020 6:30 PM GMTఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు తీర్మానాన్ని శాసనసభలో ఆమోదించారు. ఆ సమయంలో 18 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. సోమవారం వారం ఉదయం సీఎం జగన్ అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై సభ్యులందరూ మాట్లాడిన అనంతరం సీఎం జగన్ సుదీర్ఘంగా ప్రసంగించారు. అనంతరం శాసన మండలి రద్దు తీర్మానంపై స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఓటింగ్ నిర్వహించారు. ఈ తీర్మానానికి 133 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు వేశారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా తీర్మానానికి మద్దతిచ్చారు. దీంతో శాసనమండలి రద్దు తీర్మానాన్ని ఏకగ్రీవంగా అసెంబ్లీ ఆమోదిస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు.
అయితే , మండలి రద్దు తీర్మానానికి ఆమోదం తెలిపినప్పటికీ కూడా అతి ముఖ్యమైన తీర్మానం చేసేటప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సభలో లేకపోవడం పై విమర్శలు వస్తున్నారు. దీనిపై సీఎం జగన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇక టీడీపీ ముందు గానే సభకు గైర్హాజరు కావడం తో ఆ పార్టీ ఎమ్మెల్యేలు లేకుండానే సభలో మండలి రద్దు తీర్మానం పై చర్చ జరిగింది. టీడీపీ కి చెందిన 21 మంది సభకు దూరంగా ఉండగా…గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలగిరిలు సభకు వచ్చారు. అయితే , ఓటింగ్ జరిగే కొద్దిసేపటికి ముందే వారిద్దరూ కూడా సభ లో నుండి బయటకి వెళ్లి పోయారు. ఒకవేల వారు సభలో ఉండి వైసీపీ కి అనుకూలంగా ఓటు వేస్తే ..విప్ ధిక్కరణకు గురయ్యే అవకాశముంది. దీనితో వారు ఈ ఓటింగ్ కి దూరంగా ఉన్నారు.
ఇక సభ లో మండలి రద్దు తీర్మానం పై ఓటింగ్ జరిగే సమయంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభ బయట ఉన్నారు. సిఎం సభ లో ప్రసంగించే సమయం లో కొందరు సభ్యులు సభ నుండి బయటకు వెళ్లారు. సిఎం ప్రసంగం ముగిసిన వెంటనే లాంగ్ బెల్ కొట్టి ఓటింగ్ జరపాలని స్పీకర్ ఆదేశించారు. దీనితో బయటకి వెళ్లిన కొందరు సభ్యులు లోపలికి వచ్చే లోపే అసెంబ్లీ సిబ్బంది తలుపులు మూసేశారు. దీనితో సభలో ఉన్న సభ్యులు మాత్రమే ఓటింగ్ లో పాల్గొన్నారు. మొత్తంగా ఈ తీర్మానానికి అనుకూలంగా 132 మంది వైసీపీ ఎమ్మెల్యే లు ఓటింగ్ లో పాల్గొన్నారు.
ఇకపోతే వైసీపీ కి మొత్తం 151 సభ్యుల బలం ఉంది. స్పీకర్‌గా ఉండటంతో తమ్మినేని సీతారాం తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. తీర్మానానికి సమానంగా ఓట్లు వచ్చినప్పుడు స్పీకర్ తన నిర్ణయాత్మక ఓటు హక్కును వినియోగించుకునే వీలుంది. కానీ , ఈ తీర్మానం పై సంపూర్ణ మెజార్టీ ఉండటంతో ఆ అవసరం రాలేదు. కానీ , మిగిలిన 18 మంది ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. వారు సభకి ఎందుకు వారు రాలేదనేది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఓటింగ్ కు కొద్ది సమయం ముందు విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయటకు వెళ్లారు. చెన్నైలో తన సోదరుడు ఆసుపత్రిలో చేరడంతో బయటకు వెళ్లారంటున్నారు. మరోవిప్ దాడిశెట్టి రాజా ఆరోగ్యం బాగోలేక పోవడం తో సభ నుంచి బయటకు వెళ్లి పోయారు. అయితే , ఇటువంటి కీలక సమయం లో విప్ లు కూడా సభలో లేక పోవడం పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
ఇక ఓటింగ్ జరిగే సమయం లో సభ బయట గ్రంధి శ్రీనివాస్ , మేకా ప్రతాప్ అప్పారావు సభ బయటే ఉన్నారు. వారు వచ్చే సమయానికే సభ యొక్క తలుపులు మూసేయడంతో వారు బయటే ఆగిపోవాల్సి వచ్చింది. సభకు వచ్చి బయట కు వెళ్లిపోయిన వారిలో పర్వత పూర్ణ చంద్రప్రసాద్ , మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి , యూవీ రమణమూర్తి రాజు లు ఉన్నారు. వివిధ కారణాలతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి , కొలుసు పార్థసారధి సభ నుంచి వెళ్లిపోయారు. ఇక కోన రఘపతి వ్యక్తిగత కారణాలతో అసలు సభకు రాలేదు. ఇక ప్రొద్టుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద రెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి లు ఆసుపత్రి కి వెళ్లడం తో సభకు దూరంగా ఉన్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిలు అసలు సభ వైపే తొంగి చూడలేదు. మదన పల్లె ఎమ్మెల్యే నవాజ్ భాషా బెంగళూరులో స్నేహితుడి కోసం వెళ్లి తిరిగి సభలో అడుగు పెట్టలేదు. తన తల్లి చనిపోవడంతో సత్యవేడు ఎమ్మెల్యే కే. ఆదిమూలం ఇంటి వద్దే ఉండటంతో సభకు రాలేదు. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి జ్వరంతో సభకు దూరంగా ఉన్నారని చెబుతుండగా…పుట్టపర్తి ఎమ్మెల్యే డి. శ్రీధర్ రెడ్డి అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారని సమాచారం. ఏదేమైనా కూడా ఒక కీలకమైన అంశం పై తీర్మానం చేసే సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యే లు సైతం అందరూ ఓటింగ్ లో పాల్గొనకపోవడం తో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ పరిస్థితి మరోసారి జరగకుండా చూసుకోవడం అధికార పార్టీ కి మంచిది అంటూ సలహాలు ఇస్తున్నారు. పోటాపోటీ ప్రతిపక్షం ఉన్న సమయంలో ఇలాగే చేస్తే .. అధికార పార్టీకి ఇబ్బందులు తప్పవని చెప్తున్నారు.