Begin typing your search above and press return to search.

కొడాలి, వల్లభనేని అంత చీప్ నా... సీఎం క్లాస్ పీకాడా...?

By:  Tupaki Desk   |   11 Jun 2022 12:30 PM GMT
కొడాలి, వల్లభనేని అంత చీప్ నా... సీఎం క్లాస్ పీకాడా...?
X
అధికారంలో ఉన్నపుడు కొడాలి నానికి ఒక పేరు అంతా కలసి పెట్టారు. అదే ఆయన బూతుల మంత్రి అని. దానివల్లనె కొడాలి నానికి మంత్రి పదవి పోయిందని కూడా అంటారు. ఇక కొడాలి నాని సొంత నియోజకవర్గం గుడివాడలో పేకాట బాగా అప్పట్లో ఆడారని చెబుతారు. అలా గోవా నుంచి తెప్పించిన బ్యాచ్ ద్వారా సాగిన ఆ పేకాటతో అపుడు చేసిన హడావుడితో మొత్తం వైసీపీ పరువు పోయింది. ఇక్కడ కొడాలి నాని పరువు కంటే వైసీపీ పరువు ఎక్కువగా పోయింది అన్నది వాస్తవం. అందుకే అతనికి మంత్రి వర్గ విస్తరణలో మళ్లీ తిరిగి తీసుకోలేదు అని కూడా అంటారు.

ఇక వల్లభనేని వంశీ తీరు చూస్తే ఎపుడూ చూసినా ఆయన వివాదాల ఎమ్మెల్యేగానే ఉన్నారని చెబుతారు. 2019 ఎన్నికల ప్రచారంలో నేరుగా అతని మీద నిలబడి పోటీ చేసిన వైసీపీ అభ్యర్ధి ఇంటికి వెళ్లి మరీ సవాల్ విసిరిన తరువాత మొత్తానికి స్వల్ప మెజారిటీతో వల్లభనేని వంశీ బయటపడ్డారు. కానీ అధికారం వైసీపీ పరం అయింది. జగన్ 151 సీట్ల మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత చూస్తే కొడాలి నాని, పేర్ని నాని ఇద్దరూ లాబీయింగ్ చేసి మరీ ఇండైరెక్ట్ గా వైసీపీలోకి వల్లభనేనిని తీసుకువచ్చారు.

అప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో వైసీపీని టార్గెట్ చేస్తూ తన సొంత క్యాడర్ కి హెల్ప్ చేస్తూ వైసీపీని పూర్తిగా వల్లభనేని వంశీ తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు అని వైసీపీ వాళ్ళంతా గగ్గోలు పెట్టని రోజంటూ లేదు. దీని మీద వారు నేరుగా సీఎం జగన్ కే ఫిర్యాదు చేశారు కూడా.

ఇక మంత్రివర్గ విస్తరణ తరువాత మాజీగా మారిన కొడాలి నానికి, వల్లభనేని వంశీకి సీఎం జగన్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడంలేదని ప్రచారంలో ఉంది. ఇక వాళ్ళను పూర్తిగా పక్కన పెట్టేశారు అని కూడా చెబుతున్నారు. అందుకే ఈ ఇద్దరు నాయకులు ఓవరాక్షన్ చేసి మరీ పక్క పార్టీ నాయకుడు ప్రతిపక్ష నేత పెట్టిన జూమ్ లోకి దొంగ దారిన వచ్చారని అంటున్నారు.

ఒక విధంగా ఇది అల్లరి చేష్టగానే అంతా చూస్తున్నారు. సీనియర్ నాయకులుగా హుందాగా ఉండాల్సిన వారు ఇలా చేయడమేంటి అన్న చర్చ కూడా అంతటా ఉంది. మరి ఇదే తీరున వైసీపీకి చెందిన వారు ఎవరైనా జూమ్ మీటింగులు పెట్టుకుంటే దానిలో కూడా టీడీపీ వారు దొంగదారిన చొరబడితే అల్లరి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది వైసీపీ హై కమాండ్ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు.

దీంతో ఈ విషయం మీద వైసీపీ హై కమాండ్ సీరియస్ గానే ఉందని కూడా తాడేపల్లి లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు నాయకుల చిల్లర చేష్టల వల్ల పార్టీ పరువు పోతోంది అన్న ఆవేదన కూడా వ్యక్తం అవుతోంది అని అంటున్నారు. మొత్తానికి ఈ ఇద్దరి నాయకుల వ్య‌వహార శైలి మీద సీఎం జగన్ గుర్రుగా ఉన్నారని, వారికి క్లాస్ పీకారని గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఈ ప్రచారం సంగతి ఎలా ఉన్నా ఇది మాత్రం పార్టీకి మేలు చేసే పరిణామం కాదని అంతా అంటున్నారు. ఇలా ఒకరి మీటింగులలోకి మరొకరు దూరి హైజాక్ చేసేలా చేయడం అంటే ఇది కొత్త ట్రెండ్ మాత్రమే కాదు, దారుణమైన విషయంగానే అంతా చూస్తున్నారుట.