Begin typing your search above and press return to search.

బాబు గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తే మాట చెప్పిన జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   9 July 2017 12:50 PM GMT
బాబు గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తే మాట చెప్పిన జ‌గ‌న్‌
X
అంచ‌నాలు నిజ‌మ‌య్యాయి. ఏపీ విప‌క్ష నేత తాజాగా చెప్పిన మాట‌కు.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు గుండెల్లో రైళ్లు ప‌రిగెత్త‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. గ‌డిచిన మూడేళ్ల‌కు పైనే సాగిన బాబు పాల‌న‌లో ఏపీ ప్ర‌జ‌లు ఏ మాత్రం సంతృప్తిగా లేక‌పోగా.. బాబు హ‌డావుడితో విసిగిపోయి ఉన్నారు. అనుభ‌వానికి పెద్ద‌పీట వేస్తూ ఓటు వేసి.. అధికారాన్ని చేతికి అప్ప‌జెప్పిన ఏపీ ప్ర‌జ‌లు ఏమీ చేయ‌ని ప‌రిస్థితి నెల‌కొంది.

నిద్ర లేచించి మొద‌లు ప‌డుకునే వ‌ర‌కూ డ‌బ్బు.. డ‌బ్బు అన్న జ‌పంతో అవినీతి పెంచి పోషించిన బాబు స‌ర్కారు గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తే విష‌యాన్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వెల్ల‌డించారు.

బాబు ద‌గాకోరు ప్ర‌భుత్వం నుంచి ప్ర‌జ‌ల్ని కాపాడ‌టానికి తాను త్వ‌ర‌లోనే పాద‌యాత్ర చేయ‌నున్న‌ట్లుగా జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. అక్టోబ‌రు 27 నుంచి ఆర్నెల్ల పాటు రాష్ట్రవ్యాప్తంగా పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ.. ప్ర‌తి ఊరికి వెళ్లండి.. ప్ర‌తి గ్రామానికి వెళ్లండి.. త్వ‌ర‌లోనే అన్న వ‌స్తున్నాడ‌ని చెప్పండి. అంద‌రికి భ‌రోసా ఇస్తూ వెళ్లండి.. నేను కూడా వ‌స్తా.. అక్టోబ‌ర్ 27 నుంచి ఆర్నెల్ల కాలంలో 3000 కిలోమీట‌ర్లు పాద‌యాత్ర చేస్తాన‌ని వెల్ల‌డించారు.

ఇడుపులపాయ నుంచి తిరుమ‌ల వ‌ర‌కూ వెళ‌తాన‌ని.. కాలి న‌డ‌క‌న కొండెక్కి తిరుమ‌లేశుడ్ని ద‌ర్శించుకోనున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అక్క‌డ నుంచి ఇచ్చాపురం దాకా మూడు వేల కిలోమీట‌ర్లు పాద‌యాత్ర చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. మంచి రోజులు వ‌స్తున్నాయ‌ని.. వైఎస్ మాదిరి అధికారం తెచ్చుకుందామ‌న్నారు. ఇచ్చిన ప్ర‌తి హామీని నిల‌బెట్టుకుంటాన‌ని.. అందుకు అంద‌రి ఆశీస్సులు కావాల‌ని ఆయ‌న వెల్ల‌డించారు. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌పై త‌ప్పుడు కేసులు పెడుతున్న విష‌యం తెలుస‌ని.. మంచి కాలం ముందు ఉంద‌ని.. ప్ర‌తి కార్య‌క‌ర్త‌కు తోడుగా.. ద‌న్నుగా నిలవ‌నున్న‌ట్లుగా జ‌గ‌న్ పేర్కొన్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర ప్ర‌క‌ట‌న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తించ‌టం ఖాయ‌మ‌న్న అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. 2004 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు కూడా ఇదే రీతిలో వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డి చేసిన పాద‌యాత్ర ఆయ‌న‌కు అఖండ మెజార్టీ వ‌చ్చేలా చేసింది. మ‌ళ్లీ మ‌రోసారి పాద‌యాత్ర‌తో విప‌క్ష నేత ఏపీ రోడ్ల మీద‌కు రావ‌టం.. చంద్ర‌బాబుకు చేదువార్త కిందే చెప్ప‌క త‌ప్ప‌దు.