Begin typing your search above and press return to search.

సాక్షి ఉద్యోగుల‌కు 2 నెల‌ల బోన‌స్ ప్ర‌క‌టించారు!

By:  Tupaki Desk   |   24 May 2019 5:19 AM GMT
సాక్షి ఉద్యోగుల‌కు 2 నెల‌ల బోన‌స్ ప్ర‌క‌టించారు!
X
కాలం ఎంత చిత్ర‌మైంది. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల సంద‌ర్భంగా మ‌రే మీడియా హౌస్ కు లేని ఒత్తిడి సాక్షిలో ప‌ని చేసే ఉద్యోగుల మీద ఉంద‌ని చెబుతారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సొంత మీడియా హౌస్ కావ‌టం.. రాజ‌కీయ ప్ర‌భావం ఆ మీడియా సంస్థ మీద ఎక్కువ‌గా ఉంటుంది. ప‌వ‌ర్లో ఉన్న‌ప్పుడు పెట్టిన సాక్షి.. ఆ త‌ర్వాత ప‌వ‌ర్ లేని రోజుల్ని చూసింది.

ఈ సంద‌ర్భంగా ఆ సంస్థ‌లో ప‌ని చేసే ఉద్యోగులు ఎదుర్కొన్న స‌వాళ్లు.. సంక్లిష్ట ప‌రిస్థితులు అన్ని ఇన్నికావు. కొంద‌రు మ‌ధ్య‌లోనే వ‌దిలేసి త‌మ దారిన తాము వెళితే..మ‌రికొంద‌రు పంటిబిగువ‌నా బాధ‌ను ఓర్చుకుంటూ సాక్షితో ప్ర‌యాణం చేస్తున్నోళ్లు ఉన్నారు. తాజా ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌లేని ప‌క్షంలో ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు త‌ప్ప‌వ‌న్న మాట సాక్షిలో ఓపెన్ గానే చ‌ర్చ న‌డిచిన ప‌రిస్థితి. ఈ ఎన్నిక‌ల ఫ‌లితం మీద త‌మ భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు ఉద్యోగులు వ్య‌క్తం చేసేవారు.

ఇంత ఒత్తిడిలోప‌ని చేసిన వారికి తాజాగా వచ్చిన విజ‌యం వారికో స్వీట్ న్యూస్ తీసుకొచ్చింది. ఊహించ‌ని రీతిలో సాధించిన ఘ‌న విజ‌యాన్ని వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఫ్యామిలీ వెనువెంట‌నే త‌మ ఉద్యోగుల‌కు పంచేసింది. తామున్న సంతోషాన్ని సాక్షి ఉద్యోగుల‌కు పంచేందుకు వీలుగా వారికో శుభ‌వార్త‌ను చెప్పిన‌ట్లుగా తెలిసింది. ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం నేప‌థ్యంలో తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొని ప‌ని చేసిన ఉద్యోగులంద‌రికి రెండు నెల‌ల బోన‌స్ ను ప్ర‌క‌టించింది. అదే స‌మ‌యంలో.. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే జీతాల పెంపు నిర్ణ‌యం కూడా తీసుకోనున్న‌ట్లుగా చెబుతున్నారు. మీడియా వ‌ర్గాల్లో ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.