Begin typing your search above and press return to search.

జగన్ సంచలనం.. వైజాగ్ రెండో రాజధాని?

By:  Tupaki Desk   |   8 Jun 2019 9:14 AM GMT
జగన్ సంచలనం.. వైజాగ్ రెండో రాజధాని?
X
వైఎస్ జగన్ అఖండ మెజార్టీతో గద్దెనెక్కగానే సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. ముఖ్యంగా అన్ని వర్గాలకు కేబినెట్ లో ప్రాధాన్యం ఇస్తూ బీసీలకు పెద్ద పీట వేశారు. ఇక కుల సమీకరణాలకు అనుగుణంగా అణగారిన వర్గాలకు న్యాయం చేస్తున్నారు.

ఈ క్రమంలో పాలనలో తనదైన మార్పులు, చేర్పులు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇన్నాళ్లు అమరావతి రాజధానిగా సాగించిన ఏపీ పాలనను ఇక నుంచి విశాఖపట్నానికి ఇనుమడింప చేయాలని జగన్ యోచిస్తున్నట్టు తెలిసింది. విశాఖను ఏపీకి రెండో రాజధానిగా ప్రకటించాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. జగన్ గెలుపులో ఉత్తరాంధ్ర ప్రాముఖ్యత వెలకట్టలేనిది. గోదావరి జిల్లాలు - విశాఖ - ఉత్తరాంధ్రలో ప్రజలు ఆదరించారు. అందుకే పాలనను వారికి చేరువ చేయడానికి జగన్ ఏపీ రెండో రాజధానిగా విశాఖను చేయాలని డిసైడ్ అయినట్టు తెలిసింది.

మహారాష్ట్ర తరహాలోనే ముంబైతోపాటు ఫుణె - నాగపూర్ లకు తగిన ప్రాధాన్యం ఇచ్చినట్టుగానే ఏపీలో అమరావతితో పాటు విశాఖకు ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ డిసైడ్ అయినట్లు తెలిసింది.

ఇందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాలను ఒకసారి లేదా కుదిరితే రెండు సార్లు విశాఖలో నిర్వహించడానికి సాధ్యాసాధ్యాసాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. తొందరలోనే సౌకర్యాలుంటే విశాఖలో అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు చేస్తారు. అలా ఉత్తరాంధ్ర ప్రజలు కూడా సీఎం సహా మంత్రులను కలుసుకొని తమ సమస్యలు తీర్చుకునే అవకాశాన్ని జగన్ కల్పించబోతున్నట్టు తెలిసింది.