Begin typing your search above and press return to search.
దమ్ముగా డేట్స్ అనౌన్స్ చేసిన జగన్
By: Tupaki Desk | 28 Aug 2019 6:16 AM GMTపెద్ద సాహసానికే తెర తీశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికలకు ముందు వివిధ వర్గాలకు తానిచ్చిన సంక్షేమ పథకాలు.. హామీలకు సంబంధించి.. వాటిని తానెప్పుడు అమలు చేస్తానన్న విషయాన్ని తేదీల వారీగా చెప్పేసిన వైనం ఆసక్తికరంగా మారింది. తాజాగా అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన సందర్భంలో పథకాల్ని పారదర్శకంగా అమలు చేయటంతో పాటు.. రానున్న రోజుల్లో ఏ పథకాన్ని ఎప్పటినుంచి అమల్లోకి తేవాలన్న విషయంపై తనకున్న ఆలోచనల్ని చెప్పేశారు.
సాధారణంగా ఒకట్రెండు పథకాలకు సంబంధించి ఫలానా నెలలో స్టార్ట్ చేద్దామనటం కనిపిస్తుంది.ఇందుకు భిన్నంగా ఏ రోజున ఏ పథకాన్ని స్టార్ట్ చేయాలి. ఏ హామీని ఎప్పటి నుంచి అమలు చేయాలన్న విషయాల్ని స్పష్టంగా చెప్పేసిన జగన్ తీరు చూస్తే.. పాలన మీద ఆయనకున్న క్లారిటీ ఇట్టే అర్థం కాక మానదు.
కొత్త ఇసుక పాలనీని సెప్టెంబరు 5 నుంచి స్టార్ట్ చేయాలని చెప్పిన జగన్.. ప్రజల నుంచి వస్తున్న వినతుల్లో అత్యధికం ఇళ్ల స్థలాలకు సంబంధించిందేనని.. అందుకు వచ్చే ఉగాది నాటికి కచ్ఛితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తేల్చేశారు. మండలాల వారీగా ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునే వారిని గ్రామ వాలంటీర్ల ద్వారా గుర్తించాలని.. వారి పాత్ర చురుగ్గా ఉండేలా చేసుకోవాలన్నారు. వారికి త్వరలో స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని చెప్పారు.
గ్రామ సచివాలయంతో పాలనలో కొత్త పుంతలు తొక్కించాలని భావిస్తున్న జగన్.. సచివాలయాల్ని కలెక్టరేట్లతో అనుసంధానించే యాప్ తయారీ ఎంతవరకూ వచ్చిందన్న విషయంపైనా ఆరా తీశారు. త్వరలోనే ఆ యాప్ ను అందుబాటులోకి తేవాలన్నారు.
ఇక.. ఎన్నికల సందర్భంగా వివిధ వర్గాల వారికి తానిచ్చిన హామీల్ని అమలు చేసేందుకే డేట్లను ఇచ్చేశారు జగన్. వివిధ పథకాల అమలుకు అవసరమైన లబ్థిదారుల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పిన జగన్.. లబ్థిదారుల బ్యాంకు ఖాతాలకే నేరుగా నిధులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
డేట్ల వారీగా అమలు చేయనున్న పథకాల్ని చూస్తే..
% సెప్టెంబరు చివరి వారంలో సొంత ఆటో.. ట్యాక్సీ నడుపుకునే వారికి రూ.10వేల ఆర్థిక సాయం
% అక్టోబరు 15న రైతు భరోసా
% నవంబరు 21న ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా సముద్రంలో వేటకు వెళ్లే మత్య్సకారుల పడవలు.. బోట్లకు రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం
% వారి బోట్లకు అవసరమైన డీజిల్ కు ఇప్పుడు అందిస్తున్న లీటరుకు రూ.6 స్థానే రూ.9లకు పెంపు. ఆ రాయితీ మీద డీజిల్ ఇచ్చే పెట్రోల్ బంకుల్ని ఎంపిక చేయటం
% డిసెంబరు 21న మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24వేలు ఇచ్చే హామీ అమలు
% జనవరి 26న అమ్మఒడి కార్యక్రమం అమలు
% ఫిబ్రవరి చివరి వారంలో నాయి బ్రాహ్మణులు.. టైలర్లు.. రజకులకు రూ.10వేలు ఆర్థికసాయం
% ఫిబ్రవరి చివరి వారంలో పెంచిన మొత్తంతో వైఎస్సార్ పెళ్లి కానుక అమలు