Begin typing your search above and press return to search.
చంద్రబాబు ప్రశ్నలకు జగన్ జవాబు ఏంటి...?
By: Tupaki Desk | 10 April 2022 2:30 PM GMTఏపీలో నిర్మాణాత్కమైన ప్రతిపక్షంగా చంద్రబాబు సరైన టైమ్ లో స్పందించారు. ఒక వైపు విద్యుత్ కోతలు. మరో వైపు విద్యతు చార్జీల వాతలు. దీని మీద ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. విశేష అనుభవం ఉన్న నేతగా. ఎన్నో సార్లు ముఖ్యమంత్రి అయిన నాయకుడిగా చంద్రబాబుకు వీటి పైన పూర్తి అవగాహన ఉంది. అందుకే ఆయన గట్టిగానే ప్రశ్నిస్తున్నారు.
ఏపీలో ఎందుకీ విద్యుత్ కోతలూ, వాతలూ అంటూ గట్టిగానే తగులుకున్నారు. తాను దిగిపోయేనాటికి అంటే 2019 వేళకు దేశంలోని మిగులు విద్యుత్ కలిగిన మూడు రాష్ట్రాల జాబితాలో ఏపీని నిలిపానని ఆయన గుర్తు ఏశారు. ఇక తాను సీఎం గా ఉన్న టైమ్ లో ఏ ఉపద్రవం వచ్చినా సరే తట్టుకోవడానికి అన్నట్లుగా 45 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు రిజర్వ్ లో ఉంచినట్లుగా పేర్కొన్నారు.
అలాంటి తన పాలన తరువాత అంతా తారు మారు చేసిన పాపం జగన్ సర్కార్ దే అని ఆయన విమర్శిస్తున్నారు. ఇక ఏపీలో చూస్తే విద్యుత్ కంపెనీల పేరు మీద ఏకంగా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల అప్పును తెచ్చారని, బాదుడే బాదుడు అన్నట్లుగా పదహారు వేల కోట్ల రూపాయలను పెంచిన చార్జీల రూపంలో జనం నుంచి వసూల్ చేసారని గుర్తు చేశారు.
మరి ఈ డబ్బు అంతా ఎక్కడికి పోయిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో గత ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పట్టించుకోకపోవడం వల్లనే ఈ రోజు ఏపీ చీకటిమయంగా మారిందని బాబు అంటున్నారు.
ఏపీలో రబీ పంట చేతికొచ్చే సమయానికి రైతులకు ఇచ్చే విద్యుత్ ని తగ్గించడంతో పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. అదే విధంగా చూస్తే విద్యార్ధులకు పరీక్షల సమయం ఇదని, కోతలు విధిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇక పరిశ్రమలకు పవర్ హాలీడేని ప్రకటించడం వల్ల పది లక్షల మంది దాకా కార్మికులు ఉపాధి కోల్పోతారని బాబు ఆందోళన వ్యక్తం చేశారు.
ఏపీలో ఏం జరుగుతోంది. ఎందుకింత దారుణమైన పరిస్థితులు వచ్చాయని ఆయన నిలదీస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు చంద్రబాబు లేఖ రాశారు. మరి దీనికి జవాబు ఎవరు చెబుతారు. బాబు లాజిక్ తో పాటు కొన్ని పాయింట్స్ ని గట్టిగా నొక్కి మరీ చెబుతున్నారు. 42 వేల కోట్ల రూపాయలు విద్యుత్ శాఖకు వచ్చినా ఎందుకు అదనపు విద్యుతుని బయట నుంచి కొనలేకపోతున్నారు అన్న దానికి కూడా జవాబు చెప్పాలి కదా. మరి జగన్ దీని మీద ఎలా రియాక్ట్ అవుతారో మరి.