Begin typing your search above and press return to search.
జగన్ కోరిక తీర్చేసిన బాబు... ?
By: Tupaki Desk | 19 Nov 2021 1:30 PM GMTకోరక కోరక జగన్ ఒక చిత్ర విచిత్రమైన కోరిక కోరాడు. దానికి చంద్రబాబు కూడా ఆయన ఊహకు అందని జవాబు ఇచ్చాడు. దీంతో ఇపుడు లాక్కో లేక పీక్కోలేక అధికార వైసీపీ కకావికలవుతోంది. ఇంతకీ జగన్ కోరిక ఏంటి, బాబు జవాబు ఏంటి అంటే ఆ రాజకీయం కడు ఆసక్తికరమే. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడుతో జగన్ చంద్రబాబుని అసెంబ్లీకి తీసుకురండి, చూడాలని ఉంది అని కోరారుట.
నిజానికి బాబును చూడాలన్న వింత కోరిక జగన్ కి ఎందుకు కలిగిందీ అంటే కుప్పం మునిసిపాలిటీ ఓటమి తరువాత సభలో తీరని బాధతో బాబు ఎలా కనిపిస్తారో అన్న ఉత్సుకత తప్ప మరేమీ కాదు, ఒక రకంగా రాజకీయంగా బాబుని కార్నర్ చేయవచ్చు అన్న ఆలోచన కూడా దీని వెనక ఉంది. కుప్పం ఎఫెక్ట్ తో బాబు తొలిరోజు అసెంబ్లీకి రాలేదు అన్నది వైసీపీ విమర్శ అయితే నిజానికి బాబుకు ఇలా ఓటమికి వెరచి దూరంగా ఉండడం అన్నది ఏ రోజూ తెలియని పాలిటిక్స్.
అలా అనుకుంటే ఆయన ఇన్నేసి దశాబ్దాలు రాజకీయం ఎలా చేస్తారు. సో బాబు కుప్పం ఎఫెక్ట్ తో అసెంబ్లీకి రాలేదు అన్న వైసీపీ అంచనా తప్పు. ఆ విషయం రెండవ రోజు చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ తోనే వైసీపీకి అర్ధమైపోయి ఉండాలి.
చంద్రబాబు జగన్ని ఎలా టార్గెట్ చేయాలి అన్న దాని మీదనే తొలిరోజు తన ఎమ్మెల్యేలతో పక్కా వ్యూహం రచించారు. దాన్ని రెండవ రోజు చక్కగా ఎగ్జిక్యూట్ చేశారు. అయితే ఏ వ్యూహమూ లేని అధికార పార్టీయే బాబుని కుప్పం ఓటమి పేరిట విమర్శించాలనుకుని బోల్తా కొట్టింది.
చంద్రబాబు కానీ టీడీపీ తమ్ముళ్ళు కానీ మాట్లాడిందీ. బాగా గుచ్చిందీ కూడా జగన్ వ్యక్తిగత విషయమే. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుని ప్రస్థావిస్తే సభలో ప్రకంపనలు రేగుతాయన్న సంగతి బాబుకు బాగా తెలుసు. అలాగే జగన్ తల్లి, చెల్లికి ద్రోహం చేశాడు అన్న కామెంట్స్ కూడా చేశారు.
మరి ఇవి జగన్ కి కానీ వైసీపీ వారికి కానీ ఊహించని షాకులే. సడెన్ గా బాబు ఈ అంశాలు లేవనెత్తేసరికి అధికార పక్షం ఎదురుదాడి చేసింది. ఆ ఊపులో అంబటి రాంబాబు, కొడాలి నాని లాంటి వారు కొంత దూకుడుగానే మాట్లాడారు.
అదే బాబుకు కూడా కావాల్సింది. అసెంబ్లీలో అధికార పక్షం దాడి చేయడంతోనే బాబు కూడా తనదైన వ్యూహంతో ఇది కౌరవ సభ అనేశారు. తనకు గౌరవం లేని చోట ఉండనంటే ఉండను అంటూ రెండు చేతులూ జోడించి దండం పెట్టి మరీ బయటకు వచ్చేశారు. దీంతో కంప్లీట్ గా డిఫెన్స్ లో పడిపోయింది వైసీపీ. నిజానికి అధికార పక్షం బ్యాలన్స్ గా ఉండి బాబు విమర్శలను ఎదుర్కోని ఉండాల్సింది.
అలా కాకుండా బాబు కోరుకున్న విధంగానే ఆయన మీద ఎదురుదాడి చేసి కావాల్సిన సింపతీని ఇచ్చింది. తన కుటుంబాన్ని, తనను వ్యక్తిగతంగా వైసీపీ టార్గెట్ చేసింది అన్న చంద్రబాబు మాటలు అయితే జనంలోకి వెళ్లిపోయాయి. దాంతో కవరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం వైసీపీ నుంచి జరుగుతున్న జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయిందనే విశ్లేషణలు ఉన్నాయి. మొత్తానికి బాబును చూడాలని కోరరాని కోరిక కోరిన జగన్ కి జవాబు గా బాబు గట్టి రిటార్టే ఇచ్చేశారు అంటున్నారు.