Begin typing your search above and press return to search.
శ్రీనివాస్ పై 'హత్యా' రాజకీయాలు...సంచలనం!
By: Tupaki Desk | 5 Nov 2018 10:56 AM GMTఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. జగన్ పై దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనివాస్ విచారణ వ్యవహారంపై పలువురు వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తోన్న విషయం విదితమే. ఈ కేసులో శ్రీనివాస్ వెనుక ఉన్న సూత్రధారులెవరన్న దానిపై విచారణ జరగడం లేదని వారు ఆరోపిస్తున్నారు. తనకు ప్రాణహాని ఉందని నిందితుడు శ్రీనివాస్ స్వయంగా వెల్లడించాడు. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీనివాస్ తరపు లాయర్ సలీమ్ సంచలన విషయం వెల్లడించారు. తనను చంపి రాజకీయం చేయాలనుకుంటున్నారని శ్రీనివాస్ చెప్పాడని సలీమ్ వెల్లడించారు. సెంట్రల్ జైలులో శ్రీనివాస్ ను కలిసిన సలీమ్....మీడియాకు అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
`సిట్` కస్టడీ ముగియడంతో శ్రీనివాస్ ను సెంట్రల్ జైలులోని హై సెక్యురిటీ జోన్ లో ఒంటిరిగా ఉంచారు. శ్రీనివాస్ బెయిల్ కు అతడి కుటుంబ సభ్యులు ప్రయత్నించలేదు. దీంతో, న్యాయవాది సలీం అతఢి తరపున బెయిల్ పిటీషన్ తో పాటు అతడి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన మరో పిటిషన్ ను దాఖలు చేసాను. ఆ బెయిల్ పిటిషన్ రేపు నోటీసుకు రానుంది. ఈ క్రమంలో శ్రీనివాస్ ను కలిసిన సలీం అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. శ్రీనివాస్ చాలా భయపడిపోతున్నాడని - అతడిని చంపి రాజకీయం చేయాలనుకుంటున్నారని తనతో చెప్పాడని సలీమ్ అన్నారు. నేడు సాయంత్రం మరోసారి శ్రీనివాస్ ను కలుస్తానని - మరికొన్ని విషయాలు చెబుతానన్నాడని అన్నారు. తన తల్లిదండ్రులతో మాట్లాడమని శ్రీనివాస్ చెప్పాడని సలీమ్ తెలిపారు. గతంలో మీడియా ముందు తనకు ప్రాణహాని ఉందని శ్రీనివాస్ చెప్పడం...ఇపుడు శ్రీనివాస్ తరఫు న్యాయవాది కూడా అవే అభిప్రాయాలు వెల్లడించడంతో శ్రీనివాస్ భద్రతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.