Begin typing your search above and press return to search.
జగన్ పై దాడి చేసింది కోడికత్తితో కాదా?
By: Tupaki Desk | 16 Nov 2018 8:12 AM GMTవిశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు - ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై చోటుచేసుకున్న దాడికి సంబంధించి తాజాగా ఓ కొత్త కోణం వెలుగుచూసింది. దాడికి తాను ఉపయోగించింది కోడి కత్తిని కాదని నిందితుడు శ్రీనివాసరావు చెప్పినట్లు తెలుస్తోంది. అసలు కోడి కత్తి ఈ వ్యవహారంలోకి ఎలా వచ్చిందో కూడా తనకు తెలియదని అతడు పేర్కొన్నట్లు సమాచారం.
జగన్ పై దాడి చేసులో శ్రీనివాసరావు ప్రస్తుతం విశాఖ కేంద్ర కారాగారంలో రిమాండ్ లో ఉన్నారు. అతడితో తల్లి సావిత్రమ్మ - అన్నయ్య సుబ్బరాజు - బంధువు బత్తుల రామకృష్ణ ప్రసాద్ గురువారం ములాఖత్ అయ్యారు. దాడి విషయం సహా పలు అంశాలపై మాట్లాడారు. అనంతరం కారాగారం నుంచి బయటకు బయటకు వచ్చిన వారు ముగ్గురు.. మీడియాతో మాట్లాడారు. శ్రీనివాసరావుతో తమ సంభాషణను వివరించారు.
తనను బెయిలు మీద బయటకు తీసుకెళ్లాలని - బయటకు వచ్చాక అన్ని విషయాలు సవివరంగా చెప్తానని తమను శ్రీనివాసరావు ప్రాధేయపడినట్లు తల్లి సావిత్రమ్మ చెప్పారు. అంతేకాదు ఓ షాకింగ్ విషయాన్ని కూడా బయటపెట్టారు. అసలు జగన్ పై దాడికి తాను కోడి కత్తని ఉపయోగించలేదని శ్రీనివాసరావు చెప్పాడన్నారు. అనుకోకుండా జరిగిన దాడిలో జగన్ గాయపడ్డారని వివరించినట్లు తెలిపారు. కోడి కత్తిని మాత్రం తాను వాడలేదని పేర్కొన్నట్లు చెప్పారు.
మరోవైపు - శ్రీనివాసరావు బంధువు రామకృష్ణ ప్రసాద్ మాత్రం ఇందుకు కాస్త భిన్నంగా స్పందించారు. ఓ పదునైన ఆయుధంతో తాను జగన్ పై దాడి చేసింది వాస్తవమేనని శ్రీనివాసరావు అంగీకరించాడని చెప్పారు. ఆ ఆయుధం కోడి కత్తి కాదనే విషయాన్ని మాత్రం తాను స్పష్టంగా చెప్పగలనని నిందితుడు పేర్కొన్నట్లు తెలిపారు. ఒకే రోజు ఒకేసారి శ్రీనివాసరావుతో ములాఖత్ అయిన తల్లి - బంధువు కాస్త భిన్నంగా మీడియా ముందు వివరాలు చెప్పడంపై ప్రస్తుతం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.