Begin typing your search above and press return to search.
కోడి కత్తి శ్రీనును జైల్లో వేధిస్తున్నారట!
By: Tupaki Desk | 24 Sep 2019 7:04 AM GMTవిశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కోడి కత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్ గుర్తున్నాడుగా. అతడు ప్రస్తుతం రాజమహేంద్రవరం జైల్లో ఉన్నాడు. అయితే.. అతడికి సంబంధించి ఒక కంప్లైంట్ తాజాగా రాజమహేంద్రవరం ఫస్ట్ టౌన్ పోలీసులకు అందింది.
జైల్లో ఉన్న కోడి కత్తి శ్రీనును అక్కడి అధికారులు వేధిస్తున్నట్లుగా అతని సోదరుడు జనుపల్లి సుబ్బరాజు పోలీసులకు కంప్లైంట్ చేశారు. తమ తరఫు న్యాయవాది అబ్దుల్ సలీమ్ తో కలిసి పోలీస్ స్టేషన్ కు వచ్చిన సుబ్బరాజు.. లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చారు.
ఈ కేసు సీఎం జగన్ మోహన్ రెడ్డిది కావటంతో తన సోదరుడికి జైల్లో భద్రత లేదని అందుకే కేసు దర్యాప్తు బాధ్యతను పశ్చిమబెంగాల్.. కేరళ రాష్ట్రాలకుచెందిన పోలీసులకు అప్పజెప్పాలని కోరారు. అప్పుడు మాత్రమే విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని కోరారు. అయితే.. దీనిపై పోలీసుల మాట మరోలా ఉంది. సుబ్బరాజు కంప్లైంట్ ఇచ్చిన మాట వాస్తవమే కానీ.. ఎలాంటి కేసు నమోదు కాలేదని చెబుతున్నారు. మరి.. జైల్లో ఉన్న శ్రీను భద్రత మీద ఏపీ సర్కారు రియాక్ట్ అయితే బాగుంటుందన్నమాట వినిపిస్తోంది.