Begin typing your search above and press return to search.

జగన్ బెయిల్ రద్దు: మే 17కు వాయిదా వేసిన కోర్టు

By:  Tupaki Desk   |   7 May 2021 3:32 PM GMT
జగన్ బెయిల్ రద్దు: మే 17కు వాయిదా వేసిన కోర్టు
X
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ నరసపురం ఎంపి కె రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను మే 17కి హైకోర్టు వాయిదా వేసింది.

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో తన పరపతిని ఉపయోగించి సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నందున జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రెబల్ ఎంపి రఘురామకృష్ణంరాజు సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ కోర్టు పిటిషన్ ను విచారణకు స్వీకరించింది.ఈ కేసులో సీఎం జగన్ మోహన్ రెడ్డి, సీబీఐ తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరారు. వారి అభ్యర్థనను మన్నించిన కోర్టు తదుపరి విచారణ కోసం కేసును మే 17 కు పోస్ట్ చేసింది.

వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ తరుఫున నరసపురం లోక్‌సభ స్థానాన్ని గెలుచుకున్న రఘురామ కృష్ణరాజు పార్టీని, వారి నాయకత్వాన్ని సవాలు చేస్తూ తిరుగుబాటు చేశారు. ఢిల్లీ, హైదరాబాద్‌లో కూర్చుని ఆయన ముఖ్యమంత్రిపై రోజూ ఆరోపణలు చేస్తున్నారు.

సిబిఐ కేసులలో జగన్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఎంపి రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ కేసు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. సిబిఐ కోర్టు ఈ కేసు విషయంలో ఏం చెబుతుందో, వాదనలు ప్రారంభమైనప్పుడు సీబీఐ ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి. రఘురామ కృష్ణరాజు పిటిషన్ ను ఎదుర్కోవటానికి జగన్ మోహన్ రెడ్డి.. అతని న్యాయవాది ఏమి చెబుతారన్నది ఆసక్తిగా మారింది.