Begin typing your search above and press return to search.
జగన్ బెయిల్ రద్దు పిటీషన్ కొట్టివేత.. రఘురామ వెటకారం
By: Tupaki Desk | 15 Sep 2021 1:46 PM GMTఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పోరాడాడు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. అయితే ఆయన పోరాటం వృథా అయ్యింది. సీబీఐ కోర్టులో సీఎం జగన్ కు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఊరట దక్కింది. ఇప్పటికే తీర్పు వస్తుందని తెలిసి హైకోర్టుకు ఎక్కిన రఘురామకు అక్కడా షాక్ తగిలింది. దీంతో ఈ డబుల్ షాక్ ను తట్టుకోలేక తన నిరసనను కాస్త వ్యంగ్యంగా తెలిపాడు. అదిప్పుడు న్యాయస్థానాలను అగౌరపరిచేలా ఉందన్న అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.
జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ పిటీషన్లను సీబీఐ కోర్టు రద్దు చేయడంపై పిటీషనర్ రఘురామ స్పందించారు. ‘సాక్షి దినపత్రిక వార్తే నిజమని తేలిందని’ ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.
జగన్ బెయిల్ రద్దు పిటీషన్ ను సీబీఐ కోర్టు రద్దు చేసిందని సాక్షి వెబ్ మీడియాలో ఇటీవల కథనం ప్రచురితం కావడం విమర్శలకు తావిచ్చింది. బెయిల్ రద్దు పిటీషన్ రద్దు చేయకముందే ఆ మీడియాలో ఇది రావడం దుమారం రేపింది.
దీన్ని అందిపుచ్చుకున్న విజయసాయిరెడ్డి కోర్టు ధిక్కరణ కిందకు ఇది వస్తుందంటూ రఘురామ ఏకంగా సాక్షిపై హైకోర్టులో మరో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై ప్రస్తుతం విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై సాక్షి వార్త నిజమైందని రఘురామ వ్యాఖ్యానించడం ద్వారా న్యాయస్థానం విశ్వసనీయతను రఘురామ దెబ్బతీశాడని పలువురు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇది మంచిది కాదని హితవు పలుకుతున్నారు.
జగన్ బెయిల్ పిటీషన్ ను సీబీఐ కోర్టు రద్దు చేసిన నేపథ్యంలో న్యాయస్థానాలను అపార్థం చేసుకునేలా తీర్పు ఉందని రఘురామ పరోక్షంగా చెప్పారనే అభిప్రాయలు వెల్లువెత్తుతున్నాయి.